ఏపీ ప్రజల్లో ఇప్పుడుప్పుడే మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకెళుతున్న వైసీపీకి కాస్త బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన 12 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి మరీ అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లు కనిపించలేదు. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ…మున్సిపాలిటీల్లో విజయం కోసం కాస్త పోరాడాల్సి వచ్చింది. కొన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ…వైసీపీకి ఓటమి భయం చూపించిందనే చెప్పాలి.

12 మున్సిపాలిటీలో వైసీపీ 10, టీడీపీ 2 మున్సిపాలిటీలని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ గెలిచిన పదిలో ఐదు మున్సిపాలిటీల్లో తెలుగు తమ్ముళ్ళు..కాస్త వైసీపీని భయపెట్టినట్లే కనిపించారు. ఈజీగా గెలవాల్సిన మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. దాచేపల్లి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే వైసీపీ 11 వార్డుల్లో గెలిచి బొటాబొటి మెజారిటీటో గెలిచి బయటపడాల్సి వచ్చింది.

ఇక ఇక్కడ టీడీపీ 7 చోట్ల గెలవగా, టీడీపీ మద్ధతుతో జనసేన ఒక చోట గెలిచింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలిచారు. అయితే వైసీపీ గెలిచిన వాటిల్లో ఒక వారు ఏకగ్రీవం చేసుకున్నది. అలాగే రెండు వార్డుల్లో రీకౌంటింగ్ చేసి ఫలితం తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 31 వార్డులు ఉంటే వైసీపీ 18, టీడీపీ 13 చోట్ల గెలిచింది. అయితే రెండు వార్డుల్లో రీకౌంటింగ్ చేసి వైసీపీ రిజల్ట్ తారుమారు చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇటు ఆకివీడు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే వైసీపీ 12, టీడీపీ 4, టీడీపీ మద్ధతుటో జనసేన 3 వార్డుల్లో గెలిచింది.

అలాగే ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ కూడా సేమ్ సీన్. బుగ్గన రాజేంద్రనాథ్ సొంత మున్సిపాలిటీ బేతంచెర్లలో 20 వార్డులు ఉంటే వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో గెలిచింది. ఇటు జగన్ మేనమామ రవీంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ 15, టీడీపీ 5 వార్డుల్లో గెలిచింది. అసలు ఇక్కడ టీడీపీకి ఒక్క వార్డు కూడా రాదని అనుకున్నారు. మొత్తానికైతే ఈ మున్సిపాలిటీల్లో వైసీపీకి టీడీపీ ఓటమి భయం చూపించినట్లే ఉంది.

Discussion about this post