ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నందిగామ, జగ్గయ్యపేట ముందు ఉంటాయి. విజయవాడకు దగ్గరలో ఉండే ఈ స్థానాల్లో టిడిపి ఎక్కువ సార్లు విజయాలు అందుకుంది. కానీ గత ఎన్నికల్లోనే రెండుచోట్ల టిడిపి ఓటమి పాలైంది. జగ్గయ్యపేటలో తక్కువ మెజారిటీతోనే టిడిపి ఓటమి పాలైంది. అయితే ఇలా ఓటమి పాలైన సరే..త్వరగానే రెండుచోట్ల టిడిపి బలపడుతూ వస్తుంది.
ఈ రెండు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టిడిపికి కలిసొస్తుంది. జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు…ఈయనకు ఇప్పుడు అంత పాజిటివ్ కనిపించడం లేదు. ఏదో అధికార బలం తప్ప..ఇక్కడ క్షేత్ర స్థాయిలో వైసీపీకి బలం కనబడటం లేదు. ఇక్కడ టిడిపి నుంచి శ్రీరామ్ తాతయ్య దూకుడుగా పనిచేస్తున్నారు. ఈయనకు టిడిపి సీటు ఫిక్స్ అయింది. ఈయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. అలాగే వైసీపీపై వ్యతిరేకత, అమరావతి అంశం తాతయ్యకు బాగా ప్లస్ అవుతుంది. దీంతో నెక్స్ట్ జగ్గయ్యపేటలో వైసీపీ హవా నడవటం జరిగే పని కాదని తెలుస్తోంది. ఈసారి టిడిపి సత్తా చాటేలా ఉంది.

అటు నందిగామలో అదే పరిస్తితి. ముఖ్యంగా ఇక్కడ అమరావతి ప్రభావం ఎక్కువ ఉంది. కృష్ణా నదికి ఇటు నందిగామ..అటు అమరావతి ఉంటాయి..దీంతో వైసీపీ అమరావతిని వ్యతిరేకించడం వల్ల..నందిగామ ప్రజలు వైసీపీని వ్యతిరేకించే పరిస్తితి కనిపిస్తుంది. అటు వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు పాజిటివ్ తగ్గుతుంది. సంక్షేమ పథకాలు తప్ప..నందిగామలో జరిగే అభివృద్ధి పెద్దగా ఏమి లేదు. దీంతో అక్కడ కూడా వైసీపీపై యాంటీ వస్తుంది.

ఇక్కడ టిడిపి నుంచి తంగిరాల సౌమ్య పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈమె దాదాపు పోటీ చేయవచ్చు. అదే క్రమంలో కొలికిపూడి శ్రీనివాసరావు సైతం నందిగామలో పోటీ చేయడానికి చూస్తున్నారని తెలిసింది. ఏదేమైనా గాని రెండు చోట్ల ఈ సారి టిడిపి హవా నడిచేలా ఉంది.