యస్! కొన్ని కొన్నినినాదాలు… రాజకీయంగా పార్టీలకు… నాయకులకు ఎంత మేలు చేస్తాయో.. అంతే ఇ బ్బందికరంగాను మారుతుంటాయి. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఒకప్పుడు.. కీలకనినాదంగా పని చేసిన.. `నాడు-నేడు` ఇప్పుడు.. రాజకీయంగా ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. ప్రతిపక్షాలు… కొన్ని కీలక విషయాలను నాడు-నేడుతో పోల్చి ప్రచారం చేసేందుకు రెడీ అయ్యాయి. వీటి లో ప్రధానంగా. రాజధాని నగరం, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్.. ఇలాంటి ఉన్నాయి.

వాస్తవానికి జగన్ తీసుకున్న నినాదాన్ని తీసుకుంటే.. గతంలో ప్రభుత్వ పాఠశాలలు. కార్యాలయాలను ఇలా ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత..మేం ఇలా తీర్చిదిద్దాం.. అని చెప్పుకునేందుకు ప్రాధా న్యం ఇచ్చారు.. ఈ క్రమంలోనే ఆయన నాడు-నేడు అనే ప్రకటన చేశారు. ప్రబుత్వం ఏర్పాటు చేయగానే ఈ కార్యక్రమానికి సీఎం జగన్ నిధులు కూడా కేటాయించారు. పెద్ద ఎత్తున నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలను బాగు చేయించారు.అదేవిధంగా మరుగు దొడ్ల నిర్మాణాలుకూడా చేపట్టారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి,, వైసీపీకి మంచి పే రు తెచ్చింది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అమలు చేసిన నాడు. నేడు కార్యక్రమంలో వైసీపీకి ప్రశంసల జల్లును కురిపించింది. ఇదిలావుంటే.. ఇప్పుడు ఇదే నినాదాన్ని ప్రతిపక్షాలు కూడా అందుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కూడా అమరావతి రాజధానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని.. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయని.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

మరోవైపు… పోలవరం పనులు కూడా ఆశించిన విధంగా జరగడం లేదని, రహదారుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని పేర్కొంటూ.. నాడు నేడు టైటిల్‌తో పెద్ద పుస్తకం రూపొందించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెడీ అయింది. ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని.. చంద్రబాబు త్వరలోనే ప్రారంభించనున్న జిల్లాల యాత్రల్లో దీనిని హైలెట్ చేయాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇది ప్రధాన గండంగా పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post