ప్రతిపక్ష నేతలని బూతులు తిట్టడం..వారి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం..హౌస్ అరెస్ట్‌లు చేయడం..ఎవరైనా మద్ధతు ఇస్తే వారిని కూడా తిట్టడం అధికార వైసీపీ నేతలకు అలవాటైన పనిగా మారిపోయింది. అయితే ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలకు ప్రజల మద్ధతు ఉండదని అనుకుంటున్నారు..కానీ అదే రివర్స్ అయ్యి..వైసీపీపైనే వ్యతిరేకత పెరుగుతుంది. రాజకీయాలని మరింత దిగజార్చారు అని చెప్పి వైసీపీనే ప్రజలు తిట్టుకునే పరిస్తితి.

ఇక ఇటీవల రజనీకాంత్..చంద్రబాబుని పొగిడారని చెప్పి..వైసీపీ నేతలు ఏ విధంగా రజనీకాంత్‌ని తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు ఆయన వైసీపీ ఊసు గాని, జగన్ ఊసు గాని తీయలేదు. అయినా సరే వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు. ఇలా తిట్టడం వల్ల రజనీకాంత్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరనే కాన్సెప్ట్ వైసీపీ నేతలది. కానీ అలా తిట్టడమే వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది. రజనీకాంత్‌ని తిట్టడం వల్ల అటు తమిళనాడులో ఉండేవాళ్లే కాదు..ఇటు తెలుగు ప్రజలు సైతం వైసీపీని తిడుతున్నారు.
ఇదే క్రమంలో అనేక ఏళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో నటించిన మంత్రి రోజా సైతం..రజనీకాంత్ గురించి తెలిసి కూడా ఆయన్ని తిట్టడం వల్ల..ఆమెపై తమిళనాడులోని రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోజా ఉన్న గౌరవం కూడా పోగొట్టుకున్నారని అంటున్నారు. అదే సమయంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు.

ఇప్పుడు ఆ ప్రభావం వారిపై పడింది..ఇప్పటివరకు రోజాకు తమిళ ఓటర్లు మద్ధతు ఇస్తూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి లేదని అంటున్నారు. నెక్స్ట్ ఆమెని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని తమిళ ఓటర్లు అంటున్నారు. ఇప్పటికే వ్యతిరేకత తెచ్చుకున్న రోజా..రజనీని తిట్టి మరింత వ్యతిరేకత తెచ్చుకుని, ఓటమి దిశగా వెళుతున్నారు.