రాజకీయాల్లో నాయకులు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఈ రోజుల్లో ఫేక్ పాలిటిక్స్ చేస్తే..జనాలకు ఈజీగా తెలుస్తోంది. కాబట్టి ఏదైనా ఆచి తూచి మాట్లాడాలి. అయితే రాజకీయాల్లో గెలుపు కోసం అబద్దాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనలు ఉండవు. మొదట అబద్దం చెప్పినట్లు తెలియకపోయినా నిలకడగా అయినా నిజం తెలుస్తోంది.

తాజాగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల జగన్..భారీ సభల్లో పాల్గొవడం..ఆ సభల్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం..అలాగే దుష్టచతుష్టయం అంటూ కొన్ని మీడియా చానల్స్ పేరు తీసి మరీ తిట్టడం..ఇక దత్తపుత్రుడు అని పవన్ పై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇక మాటలు ప్రతి సభలోనూ చెబుతున్నారు. అలాగే తనకు ఎవరి సపోర్ట్ లేదని,ప్రజల సపోర్ట్ మాత్రమే ఉందని, ప్రజలే తన వాళ్ళని సెంటిమెంట్ లేపుతున్నారు. అదే సమయంలో తన ఎలాంటి టీవీలు, పత్రికలు లేవని చెబుతున్నారు. తాజాగా రాజమండ్రి సభలో కూడా అదే చేప్పారు.

తనకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవని, ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని..” నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక మైనార్టీని, పేద వర్గాలను మాత్రమే నమ్ముకున్నాను’’ అని ప్రజల్లో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ఇక్కడ జగన్ చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు గాని..టీవీలు, పత్రికలు లేవంటే..నమ్మే స్థితిలో ప్రజలు ఉంటారా? అంటే అసలు ఉండరనే చెప్పాలి.

ఎందుకంటే జగన్‌కు సొంత పత్రిక, సొంత మీడియా ఉన్న సంగతి జనాలకు తెలుసు..అలాగే అనుకూల మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అవన్నీ జనాలకు తెలుసు..కానీ ఏమి లేవని చెప్పి సెంటిమెంట్ లేపడానికి చూసినట్లు కనిపిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Leave feedback about this