దశాబ్దాల పాటు చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడుతున ఫ్యామిలీల్లో నల్లారి-చింతల ఫ్యామిలీలు కూడా ఉన్నాయి…అనేక ఏళ్ల నుంచి ఈ రెండు ఫ్యామిలీలు రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడుతున్నాయి…2009 ముందు వరకు వాయిల్పాడు నియోజకవర్గంలో..తర్వాత పీలేరు నియోజకవర్గంలో రెండు ఫ్యామిలీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. నల్లారి కుటుంబం కాంగ్రెస్‌లో, చింతల కుటుంబం టీడీపీలో పనిచేశాయి. అయితే ఎక్కువసార్లు నల్లారి కుటుంబమే పైచేయి సాధించింది.


కానీ 2014 నుంచి సీన్ మారిపోయింది..వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చింతల ఫ్యామిలీ హవా నడుస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేసి చింతల 2014లో గెలిచారు. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ చింతల వైసీపీ నుంచి పోటీ చేయగా, నల్లారి కిషోర్ టీడీపీలోకి వచ్చి పోటీ చేశారు…కానీ విజయం మాత్రం చింతలనే వరించింది.


ఇలా చింతల రెండుసార్లు నల్లారి ఫ్యామిలీపై పైచేయి సాధించారు. కానీ ఈ సారి కూడా చింతలకు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ నల్లారికి చెక్ పెట్టగలరా? అంటే ఈ సారి మాత్రం చింతలకు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. వరుసగా గత రెండు ఎన్నికల్లో గెలిచిన చింతల పీలేరులో గొప్ప అభివృద్ధి ఏమి చేయలేదు. అలాగే రెండుసార్లు గెలవడంతో సహజంగానే వ్యతిరేకత వచ్చింది…పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే చేసేది ఏమి లేదు కాబట్టి..అది కూడా మైనస్ అవుతుంది.


అటు నల్లారి కిషోర్ పీలేరులో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో నల్లారి పనిచేస్తున్నారు..పీలేరులో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇలా పోరాటం చేస్తున్న నల్లారి బలం పెరుగుతూ వస్తుంది…పైగా గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి నల్లారిపై ఉంది. కాబట్టి ఈ సారి నల్లారి కంచుకోటగా ఉన్న పీలేరులో మళ్ళీ చింతలకు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.


Discussion about this post