ఒక ఎటాక్..ఒకే ఒక ఎటాక్..మొత్తం టిడిపి శ్రేణులని యాక్టివ్ అయ్యేలా చేసింది…అలాగే ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న టిడిపి నేతలు దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు. పార్టీకి అండగా నిలబడటం మొదలుపెట్టారు. అయితే ఈ ఘనత అంతా వైసీపీదే అని చెప్పాలి. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

అయితే టిడిపిని అణిచివేస్తున్నామని వైసీపీ భావిస్తూ ముందుకెళుతుంది…టిడిపి కార్యకర్తలని, నేతలనీ జైలుకు పంపిస్తే పార్టీ పని అయిపోతుందని అనుకున్నారు. అలాగే అధినేతని బూతులు తిడితే సైలెంట్ అవుతారని అనుకున్నారు. కానీ వైసీపీ మొత్తం రివర్స్ చేసింది….ఎప్పటికప్పుడు టిడిపి శ్రేణులని ఇంకా యాక్టివ్ చేస్తూనే వచ్చింది. ఇక తాజా ఘటనలతో ఇంకా టిడిపిని బలోపేతం చేసిందనే చెప్పాలి.

వరుసపెట్టి టిడిపి ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేసి, టిడిపి శ్రేణులని ఏకమయ్యేలా చేశారు. వాళ్ళ బీపీలని కూడా రైజ్ చేశారు. ఇదే సమయంలో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉంటున్న టిడిపి నేతల బీపీలని కూడా పెంచింది. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడని నేతలు కూడా ఇప్పుడు వైసీపీపై విరుచుకుపడే పరిస్తితి వచ్చింది. ముఖ్యంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి…రాయలసీమ రెడ్ల పవర్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు.

ఆయన గతానికి భిన్నంగా వైసీపీపై విరుచుకుపడ్డారు. ఇక తమ నేత ఒక మాట అంటే….దానికి కొత్త అర్ధం పెట్టుకుని తనని తిడుతున్నారని జగన్ చెప్పుకుంటూ సింపతీ కొట్టేద్దామని చూస్తున్నారని, కానీ జగన్ ప్లాన్ వర్కౌట్ కాదని అన్నారు.అలాగే టిడిపిలోనే అసలు రెడ్లు ఉన్నారని, వైసీపీలో నకిలీ రెడ్లు ఉన్నారని, గత ఎన్నికల్లో మోసం చేసి రెడ్లు ఓట్లు వేయించుకున్నారని, భార్యాపిల్లలతో తిరుపతికి వెళ్లనివారు అసలు రెడ్లు కాదని ఫైర్ అయ్యారు. అంటే వైసీపీ దాడులకు నల్లారి సైతం ఎప్పుడూలేని విధంగా ఫైర్ అయిపోయారు.

Discussion about this post