అసలు తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి ఫ్యామిలీ సొత్తు…అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెడితే..ఎన్టీఆర్ తర్వాత ఆయన అల్లుడుగా ఉన్న చంద్రబాబు పార్టీని అంచలంచెలుగా నిలబెడుతూ వచ్చారు. అయితే చంద్రబాబు ఎప్పటికప్పుడు నందమూరి ఫ్యామిలీ సభ్యులకు పార్టీలో సముచితమైన స్థానం ఇస్తూనే వస్తున్నారు. హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారు…పొలిట్‌బ్యూరోలో తీసుకున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీకి పదవులు ముఖ్యం కాదనే చెప్పాలి. వారికి ఎప్పుడు పార్టీ బాగు మాత్రమే కావాలి…అందుకే ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు బాబుకు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు.

ఇక హరికృష్ణకు పార్టీలో మంచి స్థానం ఇచ్చి…అటు బాలకృష్ణకు హిందూపురం సీటు కూడా ఇచ్చారు. హరికృష్ణ చనిపోయాక ఆయన తనయులకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వాలని అనుకున్నారు. కానీ వారు సినీ రంగంలో బిజీగా ఉండటంతో, హరికృష్ణ తనయురాలు సుహాసినిని పార్టీలోకి తీసుకొచ్చారు. తెలంగాణ టీడీపీలో ఆమె కీలకంగా ఉన్నారు. ఇటు ఏపీలో బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరే టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. మిగిలినవారు పరోక్షంగా పార్టీ కోసం పాటుపడుతూనే ఉంటారు.

అయితే రానున్న రోజుల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి మరింత మంది పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ సినీ రంగంలో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటిలో పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

అటు కల్యాణ్ రామ్ సైతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే నందమూరి చైతన్యకృష్ణ…ఏదొక సమయంలో పార్టీ కోసం మాట్లాడుతూనే ఉన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తున్నారు…వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇటు తారకరత్న సైతం పార్టీ కోసం ఎప్పటికప్పుడు నిలబడుతూనే ఉన్నారు. ఇక వీరిద్దరిలో ఎవరోకరు…నెక్స్ట్ టీడీపీలో యాక్టివ్ కావొచ్చు అని తెలుస్తోంది. పార్టీ తరుపున పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.


Discussion about this post