March 28, 2023
నందిగామ సీటు కొలికిపూడికి..నిజమెంత?
ap news latest AP Politics Uncategorized

నందిగామ సీటు కొలికిపూడికి..నిజమెంత?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో నందిగామ కూడా ఒకటి…ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. కేవలం 1989, 2019 ఎన్నికల్లో మాత్రమే నందిగామలో టీడీపీ ఓడిపోయింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక..టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. వైసీపీ అధికారం బలంతో రాజకీయంగా ముందుకెళ్లడం..టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బ కొట్టేలా పనిచేయడంలో సక్సెస్ అవుతూ వచ్చింది.

ఇక మొదట్లో టీడీపీ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య..ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు..దీంతో టీడీపీకి కాస్త బలం పెరిగింది. అయితే ఇంకా నందిగామలో టీడీపీ వెనుకబడి ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల ఆత్మసాక్షి సర్వేలో నందిగామలో దాదాపు 2 శాతం ఆధిక్యంలో వైసీపీ ఉందని తేలింది. అంటే ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.  టీడీపీ నేతలు ఇంకా కష్టపడాలి. అమరావతికి దగ్గర ఉన్నా, వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే నందిగామలో టీడీపీ వెనుకబడటం కాస్త ఇబ్బందికరమైన అంశం.

అయితే ఇంచార్జ్ సౌమ్య దూకుడుగా లేకపోవడం వల్ల ఆమెని ఈ సారి మార్చేసి..అమరావతి జే‌ఏ‌సి నేత కొలికిపూడి శ్రీనివాసరావుకు నందిగామ సీటు ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అమరావతి పక్కనే ఉన్న నందిగామ సీటు ఎస్సీ రిజర్వడ్..అటు కొలికిపూడి ఎస్సీ నేత. దీంతో ఆయనకు నందిగామ సీటు ఇస్తారని రూమర్లు వస్తున్నాయి.

కానీ ఇందులో వాస్తవం అనేది లేదనే చెప్పవచ్చు..ఇంతవరకు కొలికిపూడి ఎన్నికల్లో పోటీ చేస్తాననే విషయం చెప్పలేదు. టీడీపీ అధిష్టానం కూడా ఆయన పేరు ప్రస్తావించడం లేదు. కాబట్టి నందిగామలో ఇంచార్జ్ గా ఉన్న సౌమ్యకే మళ్ళీ అవకాశం ఇవ్వవచ్చు.  

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video