విజయవాడ రాజకీయాల్లో మొదట నుంచి టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నా సరే..అంతే స్థాయిలో సొంత పోరు వల్ల రిస్క్ పెరుగుతుంది. మొదట నుంచి ఎంపీ కేశినేని నానికి బుద్దా వెంకన్న-బోండా ఉమాలతో పడని సంగతి తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు.



అక్కడ చిన్ని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు..దీంతో నానికి చెక్ పెట్టడానికి చిన్నిని దింపారని, నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు చిన్నిదే అని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై కూడా నాని అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా తన తమ్ముడుతో రాజకీయం చేయిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. అయితే చిన్నికి బోండా, బుద్దా, దేవినేని ఉమా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. చిన్ని కూడా ఎంపీ సీటు కోసం పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయడం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, 7 నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకు టచ్‌లో ఉండటం చేస్తున్నారు.

ఇలా నాని వర్సెస్ చిన్ని అన్నట్లు రాజకీయం నడుస్తోంది. పైగా నాని పార్టీ మారతారని వ్యతిరేక వర్గం పలుమార్లు ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ నాని పార్టీ మారడం కష్టం. పార్టీని సరిచేసుకొమంటే తనపైనే విమర్శలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అసలు తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పేస్తున్నారు. అదే జరిగితే సీటు చిన్నికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే విజయవాడ పార్లమెంట్‌లో నానికి వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. అలాంటప్పుడు ఆయనకు కాకుండా సీటు చిన్నికి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు.

ఒకవేళ చిన్నికి నాని సపోర్ట్ చేస్తే అప్పుడు పరిస్తితి వేరు. అలా కాకుండా నానిని కావాలని తప్పిస్తే టీడీపీకే రిస్క్.. ఒకవేళ నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే చిన్నికి సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి చూడాలి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో.

Leave feedback about this