టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు కీలక సీనియర్ నేతలు .. పార్టీ అధినేత చంద్రబాబుకు అనేక విషయాలపై సలహాలు ఇచ్చారు.వచ్చే ఎన్ని్కల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభించాలనేది దీనిలో కీలకంగా ఉన్న సూచన. అంటే.. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ కూడా రెండేళ్ల ముందుగానే ..ప్రజల మధ్యకు వెళ్లారు. వారితో మమేకం అయ్యారు. కష్టాలు తెలుసుకున్నారు. దీంతో ప్రజలకు.. జగన్‌కు మధ్య కనెక్ట్ ఏర్పడింది. తద్వారా ఆయన గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ అయిందనే భావన టీడీపీ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ కూడా అదే పంథా అనుసరించాలని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి.. యనమల రామకృష్ణుడు వంటివారు.. జిల్లాల్లో ఏదైనా చేయాలని.. ఇది భారీ ఎత్తున జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల్లో సైకిల్ యాత్ర లు చేసి.. ప్రతి మండలానికి.. గ్రామానికీ కూడా కార్యకర్తలతో పాటు నాయకులు తిరిగి.. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ 40వ ఆవిర్భావం వేడుకగా.. చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. లోకేష్‌ను సైకిల్ యాత్రకు పంపించాలని.. బాబు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను రంగంలోకి దింపి.. నియోజకవర్గాల్లో యాత్రలు చేయించాలని.. బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత కార్యాచరణ చేయకపోతే.. ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టి.. పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండద ని.. చంద్రబాబు భావిస్తున్నట్టు పరిశీలకులు… సీనియర్లు కూడా చెబుతున్నారు. ముందుగా లోకేష్‌ను రంగంలోకి దింపడం ద్వా రా.. ఆయనను ప్రజలకు మరింత చేరువ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

కుదిరితే.. తాను బస్సు యాత్రలు చేస్తూ.. మరోవైపు.. లోకేష్‌తో సైకిల్ యాత్రలు చేయించడం.. ద్వారా.. పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని.. చంద్రబాబు ఆలోచిస్తున్నా రు. ఇక, ఇదే సమయంలో నియోజకవర్గాలు.,. జిల్లాల్లోనూ.. నాయకులను దీర్ఘకాలిక ప్రాతిపదికన.. యాత్రలకు దింపాలని చూస్తున్నారు. ఇలా.. ఒకే సారి.. రాష్ట్రంలో ఒక విప్లవం వచ్చిందా.. అనే రేంజ్‌లో యాత్రలు సాగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు అనుకూలంగా మారడంతోపాటు.. పార్టీ తిరిగి పుంజుకుని అధికారంలోకి రావడం ఖాయమని..చంద్రబాబుకు సీనియర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
ReplyForward |
Discussion about this post