టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు.. ఎమ్మెల్సీ నారా లోకేష్ అనూహ్యమైన అస్త్రంతో ప్రజల్లోకి రావాలని నిర్ణ యించుకున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు.. అన్నగారు ఎన్టీఆర్ తర్వాత.. పార్టీలో ఆ తరహా మాస్ నాయకుడు.. ఇప్పటి వరకు లేరు. చంద్రబాబు క్లాస్ నాయకుడిగా.. విజన్ ఉన్న నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. అయితే.. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత.. మాస్ నాయకుడిగా ప్రజల మద్య ఉన్నారు. ఈ ఇమేజ్ జగన్‌ను సీఎంను చేసిందని.. టీడీపీ బలంగా నమ్ముతోంది. ఇంత రేంజ్‌లో మళ్లీ మాస్ నాయకుడిగా.. పార్టీ తరఫున లోకేష్ వెలుగులోకి రావాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఇటీవల కాలంలో తన ఆహార్యం మార్చుకున్నారు. అదేసమయంలో మాట తీరును కూడా మార్చుకు న్నారు. ఇక, మాస్‌కుదగ్గరయ్యేలా.. జగన్‌పైనా.. వైసీపీ నాయకులపైనా.. ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా నిర్వహిం చిన పార్టీ 40వ వార్షిక సభలో మాస్ అప్పియరెన్స్ కోసం.. చాలానే శ్రమించారు. కనీసం షేవ్ కూడా చేసుకోకుండానే.. ఆయన సభకు అటెండ్ అయ్యారు. దీనికి కారణం.. మాస్‌ను ఆకట్టుకునే పనిలో భాగంగానేనని చెబుతున్నారు.

అదేసమయంలో యువతను తన వైపు తిప్పుకునేందుకు కూడా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నగారు ఎన్టీఆర్‌ను దేవుడి తోనూ.. చంద్రబాబును రాముడుతో పోల్చినలోకేష్.. తనను తానుమాత్రం మూర్ఖుడిగా అభివర్ణించుకున్నారు. ఇది పక్కా మాస్ అప్పియరెన్స్‌ను తీసుకువస్తుందని.. సీనియర్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు లోకేష్ అంటే..క్లాస్‌గా ఉంటారని.. ఆయన మాస్‌కు దగ్గరకావడం లేదని.. పార్టీలోనూ కొంత చర్చ నడుస్తోంది.

ఇక, వైసీపీ నాయకులు కూడా ఆయనను క్లాస్ నాయకుడిగానే చూస్తున్నారు. దీంతో యువత, మాస్ పీపుల్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఇప్పుడు పంధా మార్చుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలోనే ఆయన పూర్తిగా ఖాకీ దుస్తులు ధరించి.. నుదుటిన పెద్ద తిలకం పెట్టుకునికుదిరితే.. సైకిల్ యాత్ర చేయాలని .. కూడా అనుకుంటున్నారని.. సీనియర్లు చెబుతున్నారు. ఇదంతా కూడా మాస్ ఓటింగును ఆకర్షించేందుకు దోహదపడుతుందని అంటున్నారు. మరి లోకేష్ మాస్ అప్పియరెన్స్ ఏమేరకు పార్టీకి ఆయనకు మేలుచేస్తుందో చూడాలి.
ReplyForward |
Discussion about this post