టీడీపీ యువ నాయకుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నెటిజన్లలో మంచి ఫాలోయిం గ్ పెరిగిపోయింది. అదేసమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్ చాలా ముందున్నారు. దీనికి కారణం.. ఆయన ఇటీవల కాలంలో స్పాట్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. సమస్య ఏదైనా కూడా వెంటనే స్పందిస్తు న్నారు. పార్టీలో సంబంధం లేకుండా..అందరినీ కలుపుకొని పోతున్నారు. ఎవరు సమస్యల్లో ఉంటే వారికి అండగా నిలుస్తున్నారు.

పార్టీలు.. కులాలు, మతాలు చూసుకోకుండా లోకేష్ అటు ట్వీట్‌లోనూ.. ఇటు ఫేస్‌బుక్ లోనూ.. మరోవైపు.. మీడియాలోనూ లోకేష్ దూకుడుగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా.. బాధితులకు అండగా ఉంటున్నారు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. పార్టీ నేతలను రంగంలోకిదింపుతున్నారు. ఇటీవల కాలంలో గుంటూరుకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ వైసీపీపై విరుచుకుపడింది. వాస్తవాననికి ఆమె ఎవరో ఇప్పటి వరకు తెలీదు. అయినా.. ఆమెకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆమెను ఆదుకునేందుకు లక్ష రూపాయల సాయం అందించా రు. అంతేకాదు… పార్టీ పక్షాన కూడా అండగా ఉంటామన్నారు. ఇక, తాజాగా కాకినాడలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యలోనూ లోకేష్ వేగంగా స్పందించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు అండగా నిలిచారు. ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా నెల్లూరులో టీడీపీ నాయకురాలిని మరో ముగ్గురు మహిళలు కొట్టడంపైనా.. స్పాట్‌లోనే లోకేష్ స్పందించారు.

ఇలా చేయడం వల్ల పార్టీలో నేతలకు నైతిక మద్దతు ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు పరిశీలకులు. ఇలా.. పార్టీలకు అతీతంగా బాధితులు ఎవరు ఉన్నా.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. లోకేష్ స్పాట్‌లో రెస్పాండ్ అవుతున్న తీరు.. ఆసక్తిగా ఉందని అంటున్నారు. ఇది పార్టీకి, లోకేష్‌కు కూడా మంచి మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా యూత్‌లోనూ.. లోకేష్‌కు క్రేజ్ పెంచుతోందని అంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా.. తక్షణ స్పందన లోకేష్ రాజకీయ గ్రాఫ్‌తో పాటు.. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను కూడా పెంచుతుండడం గమనార్హం.

Discussion about this post