యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ప్రజలకు అండగా ఉంటూ ఆయన ముందుకెళుతున్నారు. అయితే గతంతో పోలిస్తే లోకేష్ ఇప్పుడు లీడరుగా చాలా బలపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాని..వైసీపీ నేతలు ఎగతాళి చేయవచ్చు గాని..అయినా సరే లోకేష్ వెనక్కి తగ్గకుండా కష్టపడి మళ్ళీ ప్రజా బలం పెంచుకుంటూ వస్తున్నారు.

అయితే లోకేష్‌ని ఎగతాళి చేయడం వైసీపీ నేతలు ఆపలేదు. ఆయన పాదయాత్రకు గాని, సభలకు గాని ప్రజలు భారీగానే వస్తున్నారు..అయినా సరే లోకేష్ పై కొడాలి నాని సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా లోకేశ్ యువగళానికి పోటీగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పంపుతామని, యువగళం సభకంటే బైరెడ్డి సభకు 10 రెట్లు ఎక్కువగా యువత రాకుంటే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా? అని సవాల్ చేశారు. అంటే లోకేష్ ని తక్కువ చేసి చూపించాలనే ఈ సవాల్ చేశారని చెప్పవచ్చు.
కాకపోతే ఇక్కడ బైరెడ్డి ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే..ఏదో సోషల్ మీడియాలో నాలుగు మాటలు మాట్లాడిన వీడియోకు కేజిఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్ ఎలివేషన్లు ఇస్తేల్..వైసీపీలోని కొందరు యువత బైరెడ్డి హీరో అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అంతే తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజల్లో బైరెడ్డికి బలం ఏమి లేదు. కానీ ఇటు లోకేష్ నిదానంగా ప్రజా బలం పెంచుకుంటూ వస్తున్నారు. అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా ముందుకెళుతున్నారు.

ఇక ప్రతి దానికి జగన్ పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన లోకేష్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అదే జగన్ పెట్టిన అభ్యర్ధి పరిస్తితి లోకేష్ చేతిలో ఏం అవుతుందో చూసుకోవాలని టిడిపి శ్రేణులు సవాల్ విసురుతున్నాయి.
