ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎత్తిపరిస్తితుల్లోనూ నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా బాబు ముందుకెళుతున్నారు. ఇప్పటినుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. ఎక్కడకక్కడ నియోజకవర్గ ఇంచార్జ్లని యాక్టివ్ గా ఉంచుతున్నారు. అటు పలు సీట్లని కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు.

ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లపై కూడా బాబు ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే సెంట్రల్లో చక్రం తిప్పడానికి సరిపోతుంది. గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే ప్రతి ఎంపీ సీటుపై స్పెషల్ గా ఫోకస్ చేసి బలమైన నేతలని అభ్యర్ధులుగా పెడుతున్నారు. ఇప్పటికే సగం పైనే స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు.

ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నరసారావుపేట ఎంపీ స్థానంలో బలమైన బీసీ నాయకుడుని బరిలో దించడానికి బాబు చూస్తున్నారు. వాస్తవానికి ఈ స్థానంలో కమ్మ వర్గం తో పాటు బీసీ వర్గం ఎక్కువగా ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు పోటీ చేసి వైసీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చేతులో ఓడిపోయారు. ఈ ఇద్దరు కమ్మ నేతలే. ఇక ప్రస్తుతం రాయపాటికి వయసు మీద పడింది.

ఆయన మళ్ళీ పోటీకి రెడీగా లేరు. కానీ ఆయన తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ సీటు అడుగుతున్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారో తర్వాత తెలుస్తోంది. కానీ నర్సరావుపేట ఎంపీ సీటుని మాత్రం టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేశ్ యాదవ్కు కేటాయించనున్నారు. 90 శాతం ఈ సీటు పుట్టాకే ఫిక్స్ అంటున్నారు. ఒకవేళ వైసీపీ నుంచి ఓ కీలక నేత టీడీపీలోకి వస్తే అప్పుడు ఆలోచిస్తారేమో గాని..ఇప్పుడు పుట్టాకే నరసారావుపేట ఎంపీ సీటు ఫిక్స్.
