అధికార వైసీపీ నేతలు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఎప్పుడు ముందు ఉంటారనే చెప్పొచ్చు…ప్రజల మన్ననలు పొందాలని పనిచేస్తున్నారో లేదో తెలియదు గాని…జగన్ దృష్టిలో పడాలని మాత్రం గట్టిగా ట్రై చేస్తారు…పదవులు లేని వారు పదవులు దక్కించుకోవాలని, పదవులు ఉన్నవారు పదవులు నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంటారు…అయితే ప్రజల కోసం పనిచేస్తేనే ఏ పదవి అయినా వస్తుంది..నిలబడుతుంది. కానీ ఏపీలో అలా కాదు…జగన్‌కు భజన చేసిన వాళ్ళకు, చంద్రబాబు-లోకేష్‌ని బండ బూతులు తిట్టిన వారికి పదవులు నిలబడతాయి…పదవులు వస్తాయి…అంటే ప్రజల కోసం పనిచేస్తే కాన్సెప్ట్ ఎవరు పట్టించుకోరు.

అయితే ఇటీవల జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే…దీంతో మంత్రి పదవులు దక్కించుకోవాలని అనుకునేవారు..మంత్రి పదవి నిలబెట్టుకోవాలని అనుకునేవారు. ఇప్పుడు చేసేది ఒక్కటే…జగన్‌కు భజన చేయడం, చంద్రబాబుని తిట్టడం. పైగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో..అందరూ అసెంబ్లీని వేదికగా చేసుకుని జగన్‌కు భజన చేసేస్తున్నారు. అసలు అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చ అనేది తక్కువ…ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ అనేది ప్రజల కోసం ఉన్నట్లు లేదు..వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్‌కు భజన చేయడానికి, అలాగే బాబుని తిట్టడానికి మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది.

తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా తన నోటికి పనిచెప్పారు… నారా లోకేష్‌ని ఉద్దేశించి దారుణంగా తిట్టారు..అలాగే తమ సీఎంకు భజన చేసేశారు. మామూలుగానే నారాయణస్వామి మంత్రి అనే సంగతి రాష్ట్రంలో చాలమందికి తెలియదు..కానీ బూతులు మాట్లాడటం వల్ల హైలైట్ అవుతారని అనుకున్నట్లు ఉన్నారు…అందుకే లోకేష్‌పై అసభ్య పదజాలం వాడారు. ఈ మధ్య కాలంలో తన నేత జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి .. ముం.. లోకేశ్ అమర్యాదగా మాట్లాడుతున్నాడని, అయితే.. పదే పదే నారాయణ స్వామి ముం.. అంటూ సభలో సంబోధించడాన్ని వైసీపీ సభ్యులు అభ్యంతరం చెప్పకపోగా పగలబడి నవ్వడం విశేషం.

అంటే ఎవరు ఎలా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు..కానీ ఇప్పుడు ఇలా మాట్లాడి మంత్రి పదవి నిలబెట్టుకోవాలని నారాయణస్వామి గట్టిగానే ట్రై చేస్తున్నారు…ఎంత చేసిన నారాయణస్వామి పదవి ఊడటం ఖాయమని తెలుస్తోంది.

Discussion about this post