నర్సీపట్నం అంటే అయ్యన్నపాత్రుడు…అయ్యన్న అంటే నర్సీపట్నం అనేడ్ విధంగా రాజకీయం నడిచేది అని చెప్పచ్చు. అలాంటిది గత ఎన్నికల్లో అయ్యన్నకు వైసీపీ చెక్ పెట్టింది. ఆయన్ని ఓడించారు. అసలు నర్సీపట్నంలో అయ్యన్నకు తిరుగులేదు. 1983 నుంచి ఆయన అద్భుతమైన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. 1983, 1985లో గెలిచిన ఆయన 1989లో ఓడిపోయారు.
మళ్ళీ 1994లో సత్తా చాటారు..ఆ తర్వాత 1999 ఎన్నికల్లో అయ్యన్న గెలిచారు. ఇక 2004లో కాంగ్రెస్ హవా ఉన్నా సరే అయ్యన్న గెలిచారు.కానీ 2009 ఎన్నికల్లో అయ్యన్న ఓటమి పాలయ్యారు. అప్పుడు ప్రజారాజ్యం కాస్త ఓట్లు చీల్చడం వల్ల అయ్యన్నకు నష్టం జరిగింది. మళ్ళీ తిరిగి పుంజుకుని 2014 ఎన్నికల్లో అయ్యన్న గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో అయ్యన్న ఓడిపోయారు. దాదాపు 33 వేల ఓట్ల తేడాతో అయ్యన్న ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి పెట్ల ఉమా శంకర్ గణేశ్ గెలిచారు.

ఇలా భారీ మెజారిటీతో ఓడిపోయినా సరే అయ్యన్న ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసం కష్టపడుతూనే..మరోవైపు నర్సీపట్నంలో పుంజుకుంటూ వస్తున్నారు. వైసీపీ తన సోదరుడుని లాక్కున..తనపై తన తనయులపై కేసులు పెట్టించిన వెనక్కి తగ్గలేదు. అయ్యన్న నిత్యం పార్టీ కోసం నిలబడుతూ వచ్చారు.
అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శంకర్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా పెరుగుతూ వస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, అక్రమాలు జరగడం ఎమ్మెల్యేకు మైనస్. అందుకే ఇటీవల సర్వేల్లో అక్కడ వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని తేలింది. టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ అయ్యన్న తిరుగులేని విజయం అందుకుంటారని తేలింది. మొత్తానికి నర్సీపట్నంలో అయ్యన్న హవా ఉండనుంది.
