ప్రత్యర్ధులని బూతులు తిడుతూ..జగన్‌కు భజన చేస్తూ..జగన్ భక్తులుగా ఉండే నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ఈయన..చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. అలాగే నిత్యం జగన్‌కు భజన చేసే విషయంలో ముందు ఉంటారు. మంత్రిగా ఉన్నంత కాలం తన శాఖకు సంబంధించి ఏం చేశారో జనాలకు తెలియదు గాని..ప్రతిపక్షాలని తిట్టడం, జగన్‌ని పొగడటంలో అనిల్ బిజీగా గడిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అదే పనిచేస్తున్నారు.

అయితే ఈ పరిణామాలు అనిల్‌కు బాగా నెగిటివ్ అయ్యాయి..అందుకే సొంత స్థానంలో కూడా అనిల్‌పై వ్యతిరేకత కనిపించే పరిస్తితులు వచ్చాయి. నెల్లూరు సిటీ నుంచి అనిల్ రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీతో గెలిచి బయటపడ్డారు. ఈ సారి మాత్రం అనిల్‌కు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మామూలుగా నెల్లూరు జిల్లా అంటే వైసీపీ కంచుకోట. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది.

కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదని తెలుస్తోంది. అలా అని ఇక్కడ వైసీపీ లీడ్ తగ్గలేదు. ఏదో రెండు మూడు సీట్లలోనే పార్టీకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న సీట్లలో నెల్లూరు సిటీ కూడా ఒకటి. ఇక్కడ అనిల్‌కు గెలుపు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అందుకే అనిల్ గడపగడపకు తిరుగుతూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా టీడీపీ శ్రేణులని వైసీపీలోకి లాగేస్తున్నారట. అధికార బలాన్ని వాడి టీడీపీ క్యాడర్ని లాగుతున్నారు. అయితే అనిల్ ఎంత లాగిన సిటీలో మాత్రం ప్రజలు యాంటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ నుంచి మళ్ళీ నారాయణ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సారి అనిల్‌కు గడ్డు పరిస్థితే.
