అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి టీడీపీని దెబ్బతీయాలని వైసీపీ రాజకీయం చేస్తుంది గాని..రివర్స్ లో ఆ పార్టీలో జరిగే కొన్ని పరిణామాలు ఇబ్బందిగా మారాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. అదే సమయంలో కొందరు నేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు.



ఇందులో ఆనం గురించి చెప్పాల్సిన పని లేదు. అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి సీటు బాధ్యతలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పారు. దీంతో వైసీపీలో ఆనంకు సీటు డౌట్ అనే పరిస్తితి. అయితే ఆనం టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఆనంతో టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భేటీ కావడం సంచలనంగా మారింది.

అదే సమయంలో ఆ భేటీలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. సోమిరెడ్డి, ఆదాల, ఆనం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో ఆనం, ఆదాల టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది. 2019 ఎన్నికల ముందు ఆదాల, ఆనం టీడీపీ నుంచే వైసీపీలోకి వెళ్లారు. ఇక వచ్చే ఎన్నికల ముందు వారు వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారనే ప్రచారం వస్తుంది.

ప్రస్తుతం ఆదాల నెల్లూరు ఎంపీగా ఉండగా, ఆనం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వీరు టీడీపీలోకి వస్తే ఏ సీట్లు దక్కుతాయో క్లారిటీ లేదు. మరి వీరు వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారో లేదో చూడాలి.


Leave feedback about this