నెల్లూరు జిల్లా అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..జిల్లాలో పూర్తిగా వైసీపీ ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. ఇప్పటికీ నెల్లూరులో ఫ్యాన్ లీడ్ తగ్గలేదనే చెప్పొచ్చు. కాకపోతే కొందరు ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల వైసీపీకి కాస్త నష్టం జరిగేలా ఉంది. జిల్లాలో 10 సీట్లు ఉండగా అందులో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే మెరుగైన పనితీరు కనబర్చడంలో ముందున్నారు.

కొందరు ఎమ్మెల్యేలు అయితే ప్రజా మద్ధతు పొందడంలో పూర్తిగా వెనుకబడ్డారని చెప్పొచ్చు. ఏదో గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచేశారు గాని, వారికి సొంతంగా బలంగా కూడా పెరగడం లేదు. పలు నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన క్యాడర్ ఉండటం, ప్రజలు జగన్‌ని చూడటం వల్ల కొందరు ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. కానీ వాస్తవానికి చూస్తే కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదనే చెప్పొచ్చు.

అలా పనితీరు బాగోని ఎమ్మెల్యేల లిస్ట్‌లో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలు ఉన్నారని చెప్పొచ్చు. మొదట నుంచి ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి పెద్దగా అనుకూలంగా లేవు. అప్పటిలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలకు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ గూడూరు, సూళ్ళూరుపేటల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఈ సారి మాత్రం రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఎమ్మెల్యేల ఏ మాత్రం ప్రజలని మెప్పించలేకపోతున్నారని తెలుస్తోంది.


అసలు గూడూరు ఎమ్మెల్యేనే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వ్యతిరేకించే పరిస్తితి. ఎమ్మెల్యే వరప్రసాద్‌పై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది. అటు సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యపై కూడా వ్యతిరేకత వస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలని జగన్ ఇమేజ్ కూడా కాపాడటం కష్టమనే చెప్పాలి. టీడీపీ కొంచెం కష్టపడితే రెండు చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి.


Discussion about this post