నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు..అయితే కందుకూరు రోడ్ షోకు భారీగా జనం రావడం..అక్కడ తొక్కిసలాట జరగడం 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఘటన చంద్రబాబు అక్కడ ఉండగానే జరిగింది. దీంతో బాబు వెంటనే స్పందించడం బాధితులకు అండగా నిలబడటం చేశారు. వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గలేదు.

ఒక్కో బాధిత కుటుంబం ఇంటికెళ్ళి వారిని ఓదార్చి..ఆర్ధికంగా శ్యామ్ అందించారు. పార్టీ తరుపున 15 లక్షలు, టీడీపీ నేతలు తరుపున 10 లక్షలు…మొత్తం 25 లక్షలు అందించారు. అలాగే గాయపడ్డ వారికి సాయం అందించారు. ఇక వారికి అండగా నిలబడిన తర్వాతే బాబు కావలి రోడ్ షోలో పాల్గొన్నారు. కావలిలో కూడా భారీగానే జనం వచ్చారు. ఇక తర్వాత కోవూరులో రో షో జరగనుంది. అయితే వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో బాబు రోడ్ షోలకు మంచి స్పందన రావడం టీడీపీకి కలిసొచ్చే అంశం.

అయితే ఇదే ఊపుని టీడీపీ నేతలు కొనసాగించి పార్టీని బలోపేతం అయ్యేలా చేస్తే..వచ్చే ఎన్నికల్లో గెలుపుకు మంచి అవకాశాలు దొరుకుతాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నా సరే టీడీపీ బలపడని పరిస్తితి. ఇప్పుడు బాబు రోడ్ షోల వల్ల టీడీపీకి కాస్త ఊపు వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని టీడీపీ బలపడితే బాగానే ఉంటుంది..లేదంటే నెల్లూరులో మళ్ళీ దెబ్బతినాల్సిందే.
