తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద పట్టు లేదు. మొదట నుంచి ఈ జిల్లాలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంది. అంటే ఇక్కడ్ టిడిపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ సారి జిల్లాలో సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. కానీ అనుకున్న మేర మాత్రం బలపడినట్లు కనిపించడం లేదు. ఏదో రెండు, మూడు స్థానాల్లోనే టిడిపికి బలం కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ లో టిడిపి గెలవడం అనేది కలగానే మిగిలిపోయేలా ఉంది. 1984, 1989, 1999 ఎన్నికల్లోనే నెల్లూరులో టిడిపి గెలిచింది. మళ్లీ ఇంతవరకు గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోతూ వస్తుంది. 2009, 2014 ఎన్నికల్లో కాస్త తక్కువ ఓట్ల మెజారిటీతోనే టిడిపి ఓడిపోయింది.

2019 ఎన్నికల్లో మాత్రం లక్షా 48 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా టిడిపికి గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఇక్కడ టిడిపి తరుపున పోటీ చేసే నాయకుడు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఇక్కడ టిడిపి తరుపున ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.

అయితే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టిడిపి ఇప్పుడుప్పుడే బలపడుతుంది. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి, కందుకూరు లాంటి సీట్లలో బలపడుతుంది. నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది. అయితే టీడీపీ తరుపున బలమైన అభ్యర్ధిని పెడితే నెల్లూరు పార్లమెంట్ లో గెలవచ్చు..లేదంటే మళ్లీ ఈ సీటు కోల్పోవాల్సిందే. నెల్లూరుపై నో క్లారిటీ..మళ్లీ టీడీపీ కోల్పోవాల్సిందే?
