May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

 నెల్లూరులో బాబు స్కెచ్..ఆ నేతలకే సీట్లు!

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరుని ఈ సారి సొంతం చేసుకోవాలని టి‌డి‌పి అధినేత చంద్రబాబు చూస్తున్నారు. అక్కడ వైసీపీని దెబ్బకొట్టి టి‌డి‌పి జెండా ఎగరవేయాలని  భావిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 10కి 10 సీట్లు గెలిచేసింది. కానీ ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది.

ఇక టి‌డి‌పి గెలవడం కోసం ఆయన అభ్యర్ధుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా ఊహించని మార్పులు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో జోనల్ సదస్సులో భాగంగా 7వ తేదీన నెల్లూరులో పర్యటించనున్నారు. అప్పుడు అభ్యర్ధులపై కొంతవరకు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సర్వేల ఆధారంగా సీట్లు కేటాయించాలని చుస్తున్నారు. ప్రస్తుతం టి‌డి‌పి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..కీలక స్థానాల్లో అభ్యర్ధులని దాదాపు ఖరారు చేసినట్లే కనిపిస్తున్నారు.

నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ పోటీ చేయడం ఖాయం…అక్కడ ఆయన గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. ఇటు నెల్లూరు రూరల్ సీటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పిలోకి వచ్చి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఉదయగిరి సీటులో క్లారిటీ రావాలి. అక్కడ బొల్లినేని వెంకట రామారావు, కాకర్ల సురేష్ ఉన్నారు..అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో క్లారిటీ రాలేదు.

సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. గూడూరులో సునీల్ కుమార్, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి గాని, ఆయన కుమార్తె గాని పోటీ చేసే ఛాన్స్ ఉంది. కోవూరులో దినేష్ రెడ్డి, వెంకటగిరిలో కురుగండ్ల రామకృష్ణ పోటీ చేసే ఛాన్స్ ఉంది. సూళ్ళూరుపేట, కావలి సీట్లలో క్లారిటీ లేదు. మొత్తానికి నెల్లూరు లో ఈ సారి బలమైన అభ్యర్ధులని రంగంలో దింపడానికి బాబు రెడీ అవుతున్నారు.