నెల్లూరు రూరల్ సీటు టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని సీటు…గత మూడు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా ఓడిపోతూ వస్తుంది. అసలు ఇక్కడ టిడిపికి పెద్ద పట్టున్నట్లు కనిపించదు. పైగా రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీ డామినేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడుప్పుడే అక్కడ మార్పు కనిపిస్తుంది. రెడ్డి వర్గం కూడా మారుతుంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే.
ఇదే క్రమంలో ఆయన టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కాకపోతే ఎమ్మెల్యే పదవి ఉండటం వల్ల ఆయన ఇప్పుడే టిడిపిలో డైరక్ట్ గా చేరే అవకాశాలు లేవు. ఎన్నికల ముందే ఆయన టిడిపి లో చేరే ఛాన్స్ ఉంది. టిడిపిలో చేరితే కోటంరెడ్డి ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేయడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ లేదు. కోటంరెడ్డికే నెల్లూరు రూరల్ సీటు ఇస్తారు..కాకపోతే ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ఈయన నెల్లూరు రూరల్ తో పాటు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్నారు.

అయితే గతంలో ఈయన నెల్లూరు మేయర్ గా పనిచేస్తూ వైసీపీలో ఉండేవారు..టిడిపి అధికారంలో ఉండటంతో ఇటు వచ్చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఈయనకు సీటు లేదు..కాకపోతే నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్ధిగా ఫిక్స్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్ చేశారు..దీంతో చంద్రబాబు..అజీజ్‌ని రూరల్ అభ్యర్ధిగా పోటీ చేయించారు. కానీ అనూహ్యంగా కోటంరెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత నుంచి టిడిపి కోసం పనిచేస్తున్నారు. నెల్లూరు రూరల్ సీటు ఆశిస్తున్నారు. కానీ కోటంరెడ్డి ఎంట్రీతో అజీజ్ కు సీటు కష్టమే. అయితే కష్టపడి పనిచేయండి..ఎన్నికల సమయంలో సీట్ల గురించి చూద్దామని అజీజ్ కు బాబు చెప్పారు. అయితే అజీజ్ కు నెల్లూరు ఎంపీ సీటు గాని ఇస్తారా? అనే ప్రచారం ఉంది. కానీ రెడ్డి వర్గం హవా ఉన్న నెల్లూరు లో అజీజ్ కు ఎంపీ సీటు అయినా దక్కుతుందో లేదో చూడాలి.
