ఈరోజుల్లో నీతులు ఎదుట వాళ్ళకు చెప్పడానికే గానీ…ఎవరికి వారు మాత్రం పాటించరు. ఇక రాజకీయ నాయకుల నీతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మైక్ దొరికితే చాలు….ప్రత్యర్ధులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిపోతారు…పైగా ప్రత్యర్ధులు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు…ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని నీతులు చెబుతారు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు అదే చేస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి…సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఒక మాట అన్నారు…ఆ మాటకు అర్ధం ఏంటో ఎవరికి క్లారిటీగా తెలియదు…పైగా ఆ మాట అన్నది సీఎం జగన్‌నే అని సృష్టించుకుని, వాళ్ళు చేసిన రచ్చ ఏంటో చెప్పాల్సిన పనిలేదు.

పైగా ప్రతిపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారని నీతులు చెబుతున్నారు…అంటే వీరు చేసింది మాత్రం కనబడలేదనే చెప్పాలి. తాజాగా విజయసాయిరెడ్డి కూడా అదే వర్షన్‌లో మాట్లాడారు. బాబు ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ… స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్లారని, ఆయనో ఉగ్రవాది అని ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్యపదజాలం వాడకూడదని ఆయనకు తెలియదా? అని విజయసాయి ప్రశ్నించారు…అలాగే బాబు ఢిల్లీకి వచ్చి వ్యవస్థలని మేనేజ్ చేస్తున్నారని, డ్రగ్స్ విషయంలో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లోకేష్‌కు డ్రగ్స్, గంజాయి వ్యాపారంలో పార్ట్‌నర్‌షిప్ ఉందని మాట్లాడుతున్నారు.

అయితే ఢిల్లీకి బాబు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు…ఆయన వ్యవస్థలని మేనేజ్ చేసే సత్తా ఉంటే…ఇలా ప్రతిపక్షంలో ఉండేవారు కాదని, అలాగే జగన్, విజయసాయిలు బయట ఉండేవారు కాదని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. ఇక అనని మాటని కూడా జగన్‌నే అన్నట్లు కల్పించుకుని హడావిడి చేస్తున్న విజయసాయికి…చంద్రబాబు కూడా రాజ్యాంగబద్ధమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారనే సంగతి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన్ని ఎన్నిసార్లు వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టారో వినలేదా అని అడుగుతున్నారు.

టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ళ నరేంద్రలు గంజాయి విషయంపై ఆరోపణలు చేస్తే…పోలీసులు వెంటనే వచ్చి నోటీసులు ఇచ్చి ఆధారాలు ఇవ్వాలని అడిగారు…. మరి లోకేష్ గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్న విజయసాయికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు…ఆధారాలు ఇవ్వమని అని నిలదీస్తున్నారు. ఇదంతా వైసీపీ పోలిటికల్ డ్రామా అని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

Discussion about this post