టీడీపీకి మరోసారి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక కుట్రలు, ఎత్తులతో ముందుకొస్తున్నారు. ప్రజలని మభ్య పెట్టే విధంగా జగన్ వ్యూహాలు వేస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో కూడా టిడిపిలోని బడా నేతలని ఓడించి సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో తనదైన వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టడానికి జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లని ఓడించాలని ఎన్ని ఎత్తులు వేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అచ్చెన్నపై ఫోకస్ పెట్టారు. టెక్కలిలో అచ్చెన్నని నిలువరించాలని స్కెచ్ వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లోనే అచ్చెన్నని వైసీపీ ఓడించలేకపోయింది. దీంతో అధికారంలోకి వచ్చాక అక్కడ టిడిపిని దెబ్బకొట్టే విధంగా వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్‌ని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. ఇక ఆయన టెక్కలిలో బలం పెంచుకోవడానికి ఎన్ని రకాల ఎత్తులు వేశారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయనకు మరింత బలం ఇవ్వాలని ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు.

ఇక ఎన్ని ఇచ్చిన ఉపయోగం లేకుండా పోయింది..టెక్కలిలో దువ్వాడ బలం పెరగలేదు. అచ్చెన్న బలం తగ్గలేదు. ఇదే క్రమంలో సీటు విషయంలో దువ్వాడ ఫ్యామిలీలో విభేదాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జగన్..దువ్వాడని సైడ్ చేసి..ఆయన భార్య వాణికి టెక్కలి బాధ్యతలు ఇచ్చారు. నెక్స్ట్ సీటు కూడా ఆమెకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
మహిళా ఓట్లు కూడా కలిసొస్తాయని జగన్ ఇలా ప్లాన్ చేశారు. కానీ అక్కడ అభ్యర్ధి ఎవరిని పెట్టిన అచ్చెన్నని నిలువరించడం సులువు కాదనే చెప్పాలి. ఇప్పటికీ టెక్కలిలో అచ్చెన్నదే పై చేయిగానే ఉంది.