పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి…తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు జరిగేలా ఉన్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో టీడీపీని సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావు నడిపించారు..ఇకపై పార్టీని నడిపించడం తన వల్ల కాదని శేషారావు చేతులు ఎత్తేస్తున్నారు. గతంలో శేషారావు..నిడదవోలు నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయారు.

అయితే ఓడిపోయాక శేషారావు..నియోజకవర్గంలో అనుకున్న మేర యాక్టివ్‌గా ఉండి పనిచేయడం లేదు. దీంతో నిడదవోలులో టీడీపీ వెనుకబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ దూసుకెళుతుంది..కానీ నిడదవోలులో టీడీపీ వెనుకబడింది…శేషారావు దూకుడుగా లేకపోవడం వల్లే నిడదవోలులో ఈ పరిస్తితి వచ్చినట్లు కనిపిస్తోంది. శేషరావు యాక్టివ్‌గా లేకపోవడానికి కారణాలు లేకపోలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

భారీగా ఖర్చులు పెరిగిపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం తన వల్ల కాదని శేషారావు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు సమక్షంలో నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఖర్చు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో, దానిని తాను తట్టుకొనే పరిస్థితిలో లేనని, ఈసారి పోటీచేసే ఉద్దేశంలో లేనని పార్టీ నాయకత్వానికి శేషారావు తేల్చి చెప్పారు. కాకపోతే నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం శేషారావు పోటీ చేస్తే బాగుంటుందని చేబుతున్నారు.

కానీ పోటీ చేయడానికి శేషారావు మాత్రం ఆసక్తిగా లేరు. ఇదే సమయంలో ఖర్చుకు వెనకాడకుండా టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఇద్దరు, ముగ్గురు నేతలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. వారు ఇంచార్జ్ పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. కానీ శేషారావు వైపే మిగిలిన నాయకులు ఉన్నారు..కాబట్టి మరోసారి శేషారావుతో మాట్లాడి, ఇతర నేతల విషయం పరిశీలించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Discussion about this post