ఏపీలో టిడిపి గాలి వీయడం మొదలైందనే చెప్పాలి..ఇప్పటికే వైసీపీకి ధీటుగా బలపడిన టిడిపి..మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలోకి వస్తుంది. అదే ఊపుతో ముందుకెళితే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక టిడిపి గాలి మొదలు కావడంతో..ఆ పార్టీలో సీట్ల కోసం పోటీ పెరిగింది. ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ టిడిపికి పట్టు ఎక్కువ. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. టిడిపి నుంచి బూరుగుపల్లి శేషారావు విజయం సాధించారు. జగన్ గాలిలో 2019 ఎన్నికల్లో శేషారావు ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి శ్రీనివాస్ నాయుడు గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శేషారావు ప్రజల మద్ధతు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. గతంలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగడం లేదు. దీంతో నిడదవోలు ప్రజలు టిడిపి వైపు చూడటం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో టిడిపిలో సీటు కోసం పోటీ నెలకొంది. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే శేషారావుకే సీటు దక్కాలి. కానీ ఆయన ఓడిపోయాక కొన్ని రోజులు పార్టీలో యాక్టివ్ గా లేరు. దీంతో కుందుల సత్యనారాయణ రేసులోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య సీటు ఫైట్ నడుస్తుంది. పైగా ఇద్దరు నేతలు కమ్మ సామాజికవర్గం వారే. ఇక శేషారావు ఏమో చంద్రబాబుతో సీటు దక్కించుకోవాలని చూస్తుంటే..అటు కుందుల ఏమో లోకేష్ ద్వారా సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఇలా సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.