తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు లేరు..ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అయిపోయింది..మరో 15 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయినా సరే ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. కొన్ని సీట్లలో నేతల మధ్య పోటీ ఉండటం వల్ల సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇదే క్రమంలో టీడీపీకి పట్టున్న నిడదవోలు సీటు విషయంలో క్లారిటీ లేదు.

అయితే టిడిపి సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావు ముందు నుంచి సవ్యంగా ఉంటే ఆయనకే సీటు ఉండేది. కానీ ఆయన మధ్యలో కాస్త దూరం అవ్వడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి శేషారావు గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పార్టీకి కాస్త దూరం జరిగారు. ఇంకా తాను మళ్ళీ పోటీ చేయలేనని చెప్పారు. దీంతో టిడిపిలో కొందరు నేతలు నిడదవోలు సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక నిదానంగా పార్టీ బలపడటం..పైగా జనసేనతో పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో శేషారావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు.

ఆ మధ్య చంద్రబాబు..నిడదవోలులో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని శేషారావు చూసుకున్నారు. అదే సమయంలో కీలక నేతలు కూడా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. దీంతో నిడదవోలు సీటు విషయాంలో కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు ఈ సీటు ఎవరికి దక్కుతుందనే అంశంపై క్లారిటీ రావడం లేదు.

ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుంటే టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ టిడిపిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. కాబట్టి చంద్రబాబు నిడదవోలుపై దృష్టి పెట్టి అక్కడ పోరుకు బ్రేక్ వేసి..బలమైన అభ్యర్ధిని పెడితే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది.
