ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తోంది. అదే.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే.. ఇటీవల కాలంలో వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న యువ నాయకుడు నిమ్మల రామానాయుడు విషయం. ఆయనను పార్టీలో కట్టడి చేస్తున్నారని.. ఆయన ఎదుగుదలకు కొందరు అడ్డు పడుతున్నారని.. పార్టీలో కొందరు సీనియర్లు గుసగుసలాడుతున్నారు. “అందరినీ ఎదగనిస్తారని.. మీరెలా అనుకుంటున్నారు. మావోళ్లే మాకు శత్రువులు“ ఇదీ.. నిమ్మల రామానాయుడు ఫ్రెండ్, విజయవాడకు చెందిన ఒకనేత చేసిన వ్యాఖ్య.
అంటే..నిమ్మలను ఎదగకుండా కొందరు టీడీపీ నేతలే అడ్డు పడుతున్నారనే విషయాన్ని విజయవాడ నేత చెప్పకనే చెప్పారు. మరి దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో గట్టి వాయిస్ వినిపించే నేతల్లో ముందున్నారు నిమ్మల. గతంలో పార్టీ అధికారంలోఉన్నప్పుడు కంటే.. కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. నిమ్మలకు ప్రాధాన్యం పెరిగింది. మంచి వాయిస్.. ఎప్పటికప్పుడు స్పందించడం.. కౌంటర్లు ఇవ్వడం.. తద్వారా.. ప్రముఖంగా వార్తల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో టీడీపీ ఉప నేతగా కూడా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు.ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారనేది ఆయన అనుచరుల మాట. ఏదైనా జరిగి..ప్రస్తుతం ఉన్న అచ్చన్నాయుడు తప్పుకొంటే.. ఆ పదవిని దక్కించుకునేందుకు నిమ్మల ప్రయత్నిస్తున్నారనేది వీరి టాక్. ఈ విషయం ఎప్పుడు వెలుగు చూసిందో .. అప్పటి నుంచి నిమ్మలకు టీడీపీలో ప్రాధాన్యం తగ్గిపోయిందని.. ఇది పైస్థాయిలో నెంబర్ 2, 3గా ఉన్న నేతలే చేస్తున్న పనిగా కూడా నిమ్మల వర్గం.. ఆయన సన్నిహితులుకూడా చెబుతున్నారు.
పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కడాన్ని ముఖ్యంగా పశ్చిమ గోదావరికి చెందిన వారికి పదవులు దక్కడాన్ని టీడీపీలో ఓ వర్గం జీర్ణించుకోలేక పోతోందని.. అంటున్నారు. ఈ క్రమంలోనే నిమ్మలకు పదవులు దక్కకుండా.. ఆయనను కంట్రోల్ చేసేలా.. పైస్థాయిలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.
ReplyForward |
Discussion about this post