ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని స్థానాల్లో కైకలూరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. గత ఎన్నికల దగ్గర నుంచి ఈ సీటులో కన్ఫ్యూజన్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి తరుపున జయమంగళ వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన యాక్టివ్ గా పనిచేయలేదు. దీంతో అక్కడ పార్టీ పట్టు తప్పింది. అదే సమయంలో జనసేన తో పొత్తు ఉంటే ఆ సీటు..జనసేనకే అనే ప్రచారం ఎక్కువ గా వచ్చింది.

దీంతో జయమంగళ పెద్దగా పనిచేయలేదు. ఇటీవల పొత్తు మరింత బలపడుతున్న తరుణంలో కైకలూరు సీటు జనసేనకే ఫిక్స్ అని తేలిందట. దీంతో తనకు సీటు రాదని జయమంగళ ఫిక్స్ అయిపోయారు..ఈ క్రమంలో ఆయనకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో జయమంగళ మరో ఆలోచన లేకుండా వైసీపీలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ కూడా ఫిక్స్ అయింది.

దీంతో కైకలూరులో టిడిపికి నాయకుడు లేరు. ఈ క్రమంలోనే తాజాగా పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ..కైకలూరుకు వెళ్ళి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు..సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశిస్తే..తాను గాని, తన బాబాయి వెంకటేశ్వరరావు గాని పోటీ చేస్తారని బాబ్జీ ప్రకటించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు ముదినేపల్లి నుంచి వెంకటేశ్వరరావు పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు.

ఆ అనుభవంతో ఇప్పుడు కైకలూరు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఇక్కడ బిజేపి సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ ఉన్నారు..పొత్తు ఉంటే కైకలూరులో పోటీ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ బిజేపి కలవకుండా టిడిపి-జనసేన కలిస్తే…జనసేనలో చేరి..ఈ సీటు తీసుకోవాలని చూస్తున్నారు. మరి కైకలూరు సీటు చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.

Leave feedback about this