May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

కర్నూలు సిటీలో వైసీపీకి నో హ్యాట్రిక్ ఛాన్స్..టీడీపీకి లీడ్.!

కర్నూలు సిటీ వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం..గత రెండు ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ హవా నడుస్తుంది..ఇలా రెండుసార్లు గెలిచిన వైసీపీ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీకి టీడీపీ ఈ సారి ఛాన్స్ ఇచ్చేలా లేదు..వైసీపీ హ్యాట్రిక్ కు బ్రేక్ వేసేలా ఉంది. ఇప్పటికే అక్కడ వైసీపీపై యాంటీ ఉంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు పెద్ద పాజిటివ్ లేదు.

ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర కర్నూలు సిటీలో జరిగింది..అక్కడ ప్రజా మద్ధతు లోకేష్ కు బాగా వచ్చింది. ఇక లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని చెప్పి హఫీజ్ ఖాన్ నెగిటివ్ తెచ్చుకున్నారు. ఇలా కర్నూలులో టి‌డి‌పి పట్టు సాధించింది. అయితే గత నాలుగు ఎన్నికల నుంచి కర్నూలులో టి‌డి‌పి గెలుపుకు దూరం అవుతుంది. అసలు ఇక్కడ టి‌డి‌పి గెలిచిందే రెండుసార్లు 1983లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో గెలిచింది. ఇక 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది.

2004లో స్వల్ప మెజారిటీ తేడాతోనే టి‌డి‌పి ఓడింది. 2 వేల ఓట్ల తేడాతో ఓడింది. 2009లో పొత్తులో భాగంగా ఆ సీటు సి‌పి‌ఐకి ఇచ్చింది. కానీ అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 2014లో టీడీపీ వైసీపీపై కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడింది. 2019లో కూడా 5 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడింది. ఇలా చాలా తక్కువ మెజారిటీలతో టి‌డి‌పి ఓడిపోతూ వస్తుంది.

అలా ఓటమి పాలవ్వడంతో ఇప్పుడు టి‌డి‌పిపై సానుభూతి పెరిగింది..అటు వైసీపీపై వ్యతిరేకత కలిసొస్తుంది..దీంతో ఈ సారి కర్నూలు సిటీలో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.