గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయాక….చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావొస్తున్న సరే…కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ గా పని చేయడం లేదు. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు….పనిచేయని నేతలని పక్కనబెట్టడానికి సిద్ధమైపోయారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా నాయకులని సైడ్ చేసి…వారి స్థానాల్లో వేరే నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఇటీవల పలు నియోజకవర్గాల్లో నాయకులని మార్చారు. ఈ క్రమంలోనే టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత గడ్డ పామర్రు నియోజకవర్గంలో కూడా నాయకత్వాన్ని మార్చారు. అక్కడ ఉప్పులేటి కల్పనని సైడ్ చేసి….టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. అయితే పేరుకు పామర్రు…ఎన్టీఆర్ సొంత గడ్డ గానే….ఇక్కడ ఇంతవరకు టిడిపి జెండా ఎగరలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీ వరుసగా ఓడిపోతూ వచ్చింది.2009లో టిడిపి తరుపున కల్పన పోటీ చేసి ఓటమి పాలయ్యారు…అయితే ఆ తర్వాత కల్పన వైసీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు….అప్పుడు టిడిపి తరుపున వర్ల రామయ్య పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక టిడిపి అధికారంలోకి రావడంతో కల్పన టిడిపిలోకి వచ్చేశారు. అధికారం ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఆమె టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయాక రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.

అసలు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయరు….కార్యకర్తలని కలవరు.. అధికార పార్టీపై పోరాటం చేయరు. దీంతో ఆమెని సైడ్ చేసి చంద్రబాబు…వర్ల కుమార్ రాజాకు పామర్రు బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న వెంటనే…కుమార్ రాజా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అధికార పార్టీపై ఇంకా పోరాటాలు షురూ చేయనున్నారు.ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమవుతూ…మండలాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు సైతం….రాజాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఇక రాజా దూకుడు చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో తొలిసారి పామర్రులో టిడిపి జెండా ఎగిరేలా చేసేలా ఉన్నారు.
Discussion about this post