రాష్ట్రంలో రోజురోజుకూ అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..తప్ప తగ్గుతున్నట్లు లేదు. అధికార వైసీపీ ఎన్ని కార్యక్రమాలు చేసిన ఫెయిల్ అవుతున్నాయి తప్ప సక్సెస్ అవ్వడం లేదు..గడప గడపకు గాని, మంత్రుల బస్సు యాత్ర గాని, ప్లీనరీ సమావేశాలు గాని పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. ఏదో అక్కడక్కడ సక్సెస్ అవుతున్నాయి తప్ప…చాలా నియోజకవర్గాల్లో ఫెయిల్ అవుతున్నాయి. గడప గడపకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు ఎక్కడకక్కడ నిలదీస్తూనే ఉన్నారు. అలాగే మంత్రుల బస్సు యాత్రకు పెద్దగా స్పందన రాలేదు.

ఇక ప్లీనరీ సభలు వెలవెలబోతున్నాయి. జనాలు లేక సభలు ఫెయిల్ అవుతున్నాయి. ఎలాగోలా బలవంతంగా జనాలని రప్పించిన సరే…మధ్యలోనే వారు వెళ్లిపోవడంతో ప్లీనరీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్తితి కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో కూడా కనిపిస్తోంది. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు పూర్తిగా ఎదురుగాలి వీస్తుంది. గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ప్లీనరీ సభలు సైతం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు.

దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాన్ ఎమ్మెల్యేల పరిస్తితి పెద్దగా బాగోలేదని అర్ధమవుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది…ఇంకా రాను రాను వ్యతిరేకత పెరిగితే ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాన్ ఎమ్మెల్యేల గెలుపు కష్టమైపోతుందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న ఏడు స్థానాల్లో వైసీపీ ఆరు చోట్ల గెలిచింది. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో గెలిచింది.

ఇక విజయవాడ తూర్పులోనే టీడీపీ గెలిచింది. అయితే నిదానంగా గెలిచిన ఆరు స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత మొదలైంది. పైగా టీడీపీ ఊహించని రేంజ్ లో పుంజుకుని కొన్ని చోట్ల లీడ్ లోకి వచ్చింది. విజయవాడ సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట స్థానాల్లో లీడ్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది…విజయవాడ తూర్పులో ఎలాగో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. అలాగే విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ సారి ఫ్యాన్ పార్టీకి చుక్కలు కనిపించేలా ఉన్నాయి.

Discussion about this post