ఔను.. రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. జిల్లాలు ఏర్పడిన తర్వాత.. పార్టీ పరంగా వైసీపీ పుంజు కుంటుందని.. తమకు ఎనలేని గుర్తింపు లభిస్తుందని.. అధికార పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే.. ఈ అంచనాలు ఎక్కడా పనిచేయడం లేదని సమాచారం. ఎందుకంటే.. జిల్లాలైతే..ఏర్పాటు చేశారుకానీ.. దీనివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను మాత్రం ప్రభుత్వం వారికి వివరించే ప్రయత్నం చేయలేక పోయింది. దీంతో కొత్త జిల్లాల వ్యవహారం.. కేవలం నామమాత్రంగా మిగిలిపోయింది.

ఈక్రమంలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకున్నా.. వైసీపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఇదిలావుంటే. . కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే… ఈ జిల్లాకు పేరు పెట్టడం వెనుక.. టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. మరి ఈ సంకల్పం నెరవేరుతుందా? అంటే..చెప్పడం కష్టంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే.. ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో.. దాదాపు మూడు నుంచి 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కష్టమనే చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీఫస్ట్ ఓడపోయే నియోజకవర్గం ఇదీ.. అంటూ.. అందరూ తమ వేళ్లను మైలవరం వైపే చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి వసంత కృష్ణప్రసాద్ విజయం దక్కించుకున్నా రు. అయితే.. ఆయన గత మూడేళ్లుగా ప్రజలకు ఆయనకు మధ్య సంబంధాలు కట్ అయ్యాయి.

అంతేకా దు.. అభివృద్ధిని పట్టించుకోకుండా.. సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నా యి. పైగా. ఇక్కడ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా గ్రాఫ్ పెరిగిందని తెలుస్తోంది. ఈ నేప థ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పోగొట్టుకునే తొలి అసెంబ్లీ స్థానంమైలవరమేనని అంటున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. అయితే.. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. వచ్చే ననెల నుం చి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని పెట్టుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దీనిని సక్సెస్ చేస్తే.. కొంతవరకు గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post