టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు.. తెలుగువారి అన్నగారు.. నందమూరి తారక రామారావు.. శత జయంతి ఈ ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించుకునే టీడీపీ నాయకులు.. ఈ ఏడాది అన్నగారు జన్మించిన 99వ సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న శత జయంతికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శత జయంతిని ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణ సహా .. తెలుగు వారు ఉన్న ప్రతిరాష్ట్రంలోనూ.. ఎన్టీఆర్ శతజయంతి ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో అమెరికా, దుబాయ్.. జపాన్ వంటి దేశాల్లోనూ తెలుగు దేశం పార్టీ నాయకులు శత జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక, ఈ శత జయంతి పార్టీలోనూ.. నేతల్లోనూ జోష్ నింపుతుందని అంటున్నారు సీనియర్లు.

అన్నగారి స్ఫూర్తితో ముందుకు సాగడం.. ఇప్పుడు కీలకంగా మారుతున్న పరిణామం. ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపించడంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. నాయకులను నమ్మే పరిస్థితి లేకుండా.. పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అప్పట్లో నూ అన్నగారు ఇలాంటి అనేక సమస్యలు ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అడుగులు వేసేలా.. పార్టీకి దిశానిర్దేశం చేసేలా.. ముందు సాగాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో మరో వారంలో నిర్వహించనున్న మహానాడులో శత జయంతికి సంబంధించి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏడాది పాటు నిర్విరామంగా.. ఈ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రతిగ్రామం, మండలంలో అన్నగారి శతజయంతిని నిర్వహించి.. పార్టీకి మరోసారి ప్రజలను అంకింత చేసేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ శత జయంతి.. అన్నగారి కుటుంబానికే కాకుండా.. ప్రజలకు కూడా ఆనందం కలిగిస్తుందని అంటున్నారు.

Discussion about this post