దివంగత ఎన్టీఆర్ పుట్టిన గడ్డ పామర్రు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి పెద్దగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు..ఇదే నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సొంత గడ్డ అయినా సరే ఇక్కడ ఇంతవరకు టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే.

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే పరిస్తితి ఉందా? అంటే అది చెప్పలేని పరిస్తితి. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఉన్నారు. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఈయనే. భారీ మెజారిటీతో గెలిచారు గాని..ఆ స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు…పైగా ఇసుకలో దోపిడి జరుగుతుందని, ఇంకా పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యే పనితీరు పట్ల పామర్రు ప్రజలు సంతృప్తిగా లేరు.

ఇక వైసీపీలో ఇలాంటి పరిస్తితి ఉంటే..దాన్ని టీడీపీ ఉపయోగించుకోలేకపోతుంది.టీడీపీ తరుపున వర్ల రామయ్య తనయుడు కుమార్ రాజా పనిచేస్తున్నారు. ఈయన పామర్రులో యాక్టివ్ గానే తిరుగుతున్నారు..కానీ బలాన్ని పెంచుకోలేకపోతున్నారు. ఏ కార్యక్రమం అయిన కార్యకర్తల చేతే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. ఇక్కడ కమ్మ వర్గం పూర్తిగా వర్లకు సహకారం అందించే పరిస్తితి కనిపించడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీ బలం పెరగడం లేదు.

పైగా ఇక్కడ ఎస్సీ ఓట్లు ఎక్కువ..వారు వైసీపీ వైపే ఉన్నారు..దీంతో ఈ స్థానంలో ప్రస్తుతానికి 6 శాతం ఆధిక్యంలో వైసీపీనే ఉందని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇప్పటినుంచి టీడీపీ బలపడకపోతే మళ్ళీ పామర్రుని కోల్పోవాల్సిందే.

Leave feedback about this