కృష్ణా జిల్లాలో ఈ సారి ఫ్యాన్ రివర్స్ అయ్యేలా ఉంది…గత ఎన్నికల్లో జగన్ గాలిలో జిల్లాలో ఫ్యాన్ హవా నడిచింది గాని ఈ సారి మాత్రం…ఫ్యాన్ గాలి పెద్దగా వీచేలా లేదు…ఇప్పటికే ఫ్యాన్ వల్ల ఏం జరుగుతుందో ప్రజలకు బాగా అర్ధమవుతుంది…జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం ఒరిగిందో కూడా క్లారిటీ వస్తుంది..ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఎలా ముందుకెళుతున్నారో తెలిసిందే..ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ సారి జిల్లాలో రాజకీయాలు అనూహ్యంగా మారేలా ఉన్నాయి…ఇప్పటికే చాలావరకు రాజకీయం మారిపోయింది…జిల్లాలో ఉన్న మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేక గాలి తప్ప..అనుకూల గాలి మాత్రం కనిపించడం లేదు..ఇదే సమయంలో టీడీపీకి అనుకూల వాతావరణం బాగా కనిపిస్తోంది..ఈ క్రమంలోనే నూజివీడు నియోజకవర్గంలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఈ సారి నూజివీడులో ఫ్యాన్ రివర్స్ అయ్యేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో నూజివీడు ఫ్యాన్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే….రెండు సార్లు వైసీపీ నుంచి మేకా ప్రతాప్ విజయం సాధించారు.

కానీ ఈ సారి మాత్రం ఆయనకు మళ్ళీ గెలిచే అవకాశం కనిపించడం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు…వ్యక్తిగతంగా ఎమ్మెల్యే ప్రతాప్ పై పెద్దగా నెగిటివ్ లేదు కానీ పనితీరు పరంగా నెగిటివ్ ఉందని చెప్పొచ్చు. అధికారంలో ఉన్న సరే ఆయన నూజివీడు చేసిన అభివృద్ధి పెద్దగా లేదు…ఏదో సంక్షేమ పథకాలు అందడం తప్ప…నూజివీడు ప్రజలకు కొత్తగా ఒరిగింది ఏమి లేదు. అటు స్థానిక వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇవన్నీ వైసీపీకి మైనస్ అవుతున్నాయి…అదే సమయంలో వరుసగా ఓడిపోతున్న సానుభూతి టీడీపీపై ఉంది.. టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు…ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…ఈ సారి గాని నూజివీడులో ఉన్న టీడీపీ గ్రూప్ తగాదాలు తగ్గితే ఈ సారి ఖచ్చితంగా వైసీపీని ఓడించవచ్చని చెప్పొచ్చు.

Discussion about this post