టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహానాడు గ్రాండ్.. సూపర్.. హిట్ అయింది. అయితే.. వచ్చే ఎన్ని కలకు సంబంధించి.. టికెట్ల విషయంలో.. రెండు రకాల ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి. ఒకటి. మూ డు సార్లు ఓడిపోయన నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదన్నారు. దీనికి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. మంచి పరిణామమనే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే.. లెక్కకు మిక్కిలిగా ఓడిపోయినా.. తమకు ఎలాం టి ఇబ్బంది లేదని.. నమ్ముతున్న నాయకులకు చెక్ పెట్టడం మంచిదనే మాటే వినిపిస్తోంది.

నిజానికి ఇప్పటి వరకు కూడా చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందు పార్టీలో హడావుడి చేయడం .. టికెట్ తెచ్చుకోవడం.. గెలిస్తే.. ఉండడం లేకపోతే.. మళ్లీ వ్యాపారాలు చేసుకోవడం..ఇటీవల కాలంలో రివాజుగా మారిపోయింది. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారివల్ల నిజమైన నాయకులు పనిచేయలేక పోతు న్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో పోయినవాళ్లు పోయినా.. ఉన్నవాళ్లతో అయినా.. పార్టీని డెవలప్ చేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

దీంతో నిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ నేపథ్యం లో టికెట్ ఆశిస్తున్నవారు.. బయటకు వస్తున్నారా? లేదా? అనేది చూడాలి. మరోవైపు.. ఒక కుటుంబానికి ఒక టికెట్ అనే ఫార్ములా కూడా మహానాడులో చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు కర్నూలు.. అనంతపురం వంటి జిల్లాలో ఒక కుటుంబంలోనే ఇద్దరికి కూడా టికెట్లు కావాలంటూ.. ఒత్తిడి వచ్చింది. అయితే.. ఇప్పుడు కూడా ఈ మాటే వినిపిస్తోంది.

కానీ, ఇలా చేయడం వల్ల.. ఇతరులకు అవకాశం లేకుండా పోతోంది. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే సంప్రదాయం మొదలు పెడితే.. పార్టీకి గుదిబండగా మారుతుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుండడం గమనార్హం. అందకే.. ఈ విషయంపైనా.. త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించను న్నారు. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబానికే పెద్ద చిక్కు వచ్చే అవకాశం ఉంది. ఒకే కుటుంబం ఆయన,ఆయన తనయుడు కూడా టికెట్లు తీసుకోకతప్పదు. సో, ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Discussion about this post