గెలుపు దగ్గరకొచ్చి బ్యాడ్ లక్ కొద్ది టీడీపీ ఓడిపోతున్న సీట్లలో ఒంగోలు పార్లమెంట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాలని 2004 నుంచి టీడీపీ ప్రయత్నిస్తుంది..కానీ గెలుపు దక్కడం లేదు. ఎప్పుడో 1984లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో మాత్రమే ఒంగోలులో టీడీపీ గెలిచింది. ఇక 2004,2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి టీడీపీ ఓడిపోయింది.

అయితే ఈ సారి ఎట్టి పరిస్తితుల్లో ఒంగోలు ఎంపీ సీటుని గెలిచి తీరాలని టిడిపి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టుగా టిడిపి బలం పుంజుకుంటుంది..అదే సమయంలో వైసీపీపై వ్యతిరేకత కనబడుతుంది. కాకపోతే ఈ సారి ఒంగోలు ఎంపీగా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడుగా నూకసాని బాలాజీ ఉన్నారు. ఆయన్నే ఒంగోలు ఎంపీగా పోటీకి దింపుతారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి..టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది..కానీ ఆ ప్రచారంలో ప్రస్తుతానికి నిజం లేదని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం నూకసాని మాత్రమే ఒంగోలు పార్లమెంట్ లో ఆప్షన్ గా ఉన్నారు. మరి ఆయన్ని దింపుతారా? వేరే వారికి ఛాన్స్ ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇక ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టిడిపికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు పరిధిలో ఉన్న దర్శి, ఒంగోలు, కనిగిరి, కొండపి స్థానాల్లో టిడిపి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది. అంటే ఇంచుమించు రెండు పార్టీలు పోటాపోటిగా ఉన్నాయి. మరి ఈ సారి ఒంగోలుని టిడిపి కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.
