ఏదేమైనా ఈ సారి ప్రకాశం జిల్లా తెలుగు తమ్ముళ్ళు మాత్రం బాగా దూకుడు మీద ఉన్నారు..మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం టీడీపీ నేతలు..సూపర్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎలాగైనా జిల్లాలో ఆధిక్యం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్నారు. ఏ మాత్రం పట్టు వదలకుండా ప్రకాశం తమ్ముళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ లీడర్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.

ఇటు పార్లమెంట్ అధ్యక్షులు సైతం దూకుడుగా పనిచేస్తున్నారు…ఇటు ఒంగోలు అధ్యక్షుడు నూకసాని బాలాజీ గాని, అటు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు గాని…పార్టీని బలోపేతం చేయడంలో ముందున్నారు. అయితే ఇప్పటికే బాపట్లలో టీడీపీకి లీడ్ కనిపిస్తోంది. ఇక ఒంగోలు పార్లమెంట్‌లోనే పార్టీ ఇంకా పుంజుకోవాలి..అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గానే పార్టీ పరిస్తితి ఉంది.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్తితి బాగానే ఉంది…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటుని గెలుచుకోవాలనే కసితో తమ్ముళ్ళు ఉన్నారు. ఇంతవరకు ఒంగోలు ఎంపీ సీటుని లాస్ అవుతూనే ఉంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ఒంగోలు ఎంపీ సీటుని టీడీపీ గెలుచుకుంది. 1984, 1999 ఎన్నికల్లోనే గెలిచింది. అక్కడ నుంచి మళ్ళీ ఒంగోలులో పార్టీ గెలవలేదు. 2014 ఎన్నికల్లో గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టింది.

ఇక 2019లో జగన్ గాలిలో కోల్పోవాల్సి వచ్చింది…అయితే ఈ సారి ఒంగోలు సీటుని వదలకూడదని తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారు. ఎలాగైనా ఎంపీ సీటుని గెలుచుకోవాలని చూస్తున్నారు. ఎలాగో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉండే అసెంబ్లీ సీట్లలో టీడీపీ బలం పెరుగుతుంది…ఈ సారి అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుచుకుంటే..ఆటోమేటిక్‌గా ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడుతుంది. అయితే ఒంగోలు పార్లమెంట్‌లో టీడీపీకి బలమైన అభ్యర్ధిని కూడా పెట్టాల్సి ఉంది. అప్పుడే ఈజీగా ఒంగోలు సీటు టీడీపీ ఖాతాలో పడుతుంది.
Discussion about this post