ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంది. పేరుకు మాత్రమే వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు… వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు తమ నియోజకవర్గాల్లో చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అకౌంట్లోకి నిధులు వెస్తోంది తప్ప… ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తున్న చిన్నచిన్న పనులు కూడా చేయట్లేదు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే… అమరావతి రాజధానిగా ఉన్న కృష్ణా – గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది.

రాజధాని వికేంద్రీకరణ తర్వాత కృష్ణా – గుంటూరు జిల్లాల్లో వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రజల తలసరి ఆదాయాలు పడిపోయాయి. మరోవైపు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. భూములు ఇచ్చిన రైతులు వ్యాపారాలు పోగొట్టుకున్న వారి పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేస్తే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అక్కడ ప్రజలు వైసీపీకి ఓటు వేశారు.

ఇవన్నీ వైసిపి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అయితే సాధారణ ఎన్నికల వేళ తమకు గట్టి దెబ్బ తగులుతుందని.. కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. రాజధాని మార్పు తో ఈ రెండు జిల్లాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న విషయం ఎమ్మెల్యేలకు తెలుసు. అయితే వారు పైకి చెప్పలేని పరిస్థితి ఉంది. పైకి మాత్రం కృష్ణ – గుంటూరు జిల్లాల ప్రజలు కూడా మూడు రాజధానులు సపోర్ట్ చేస్తున్నారు.

అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకే ఓట్లేశారు అని చెబుతున్నా.. ప్రజల్లోకి వెళ్లి ఆ విషయాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఏదేమైనా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం చేయలేదు.. అలాగని 2024 ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయం తెలియడంతో వారు రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు.

Discussion about this post