రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు…ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడు రాజకీయంగా విఫలం అవ్వడం గ్యారెంటీ..2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు అలాగే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పనిచేసేవారు. ఇంకా అధికారంలో ఉండటంతో ప్రజల మద్ధతు పూర్తిగా తమకే ఉందన్నట్లు చెప్పుకునేవారు..మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉంటారని అనుకునేవారు. పైగా చంద్రబాబు సైతం తమ పాలనపై ప్రజలు 80 శాతం సంతృప్తిగా ఉన్నారని, 90 శాతం ఉన్నారని చెప్పుకునే వారు.

ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్ళడంతో 2019 ఎన్నికల్లో ఏమైందో చెప్పాల్సిన పని లేదు..టీడీపీకి దారుణమైన ఓటమి వచ్చింది. సరే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉందా? అంటే అబ్బో టీడీపీ కంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీ నేతలకు ఉంది. అసలు జీవితాంతం తామే అధికారంలో ఉంటామనే ధీమా వైసీపీ నేతల్లో ఉంది..పైగా జగన్ మరో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని తెగ చెప్పుకుంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో…ఇంకా తమకు ఎదురులేదని, ఇంకా తమకు ఓటమి లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అసలు జనం మద్ధతు మొత్తం మాకే ఉందనే ఫీలింగ్‌లో ఉన్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి సైతం అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్‌మెంట్ ఒకటి ఇచ్చారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీకి తప్ప వేరే పార్టీకి ప్రజలు ఓటు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పుకొచ్చారు.

అంటే వైసీపీ పాలన చూసి ప్రజలు మరో పార్టీకి ఓటు వేయరని పెద్దిరెడ్డి చెబుతున్నారు. మరి పెద్దిరెడ్డి చెప్పినట్లుగా రాష్ట్రంలో అదే పరిస్తితి ఉందా? అంటే ఆ విషయం జనంలోకి వెళ్ళి పెద్దిరెడ్డి లాంటి వారు తెలుసుకుంటేనే బెటర్ అని చెప్పొచ్చు. వైసీపీ పాలనపై ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్ధమవుతుంది. ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళితే చివరికి ఏం అవుతుందో చూడాలి.

Discussion about this post