జగన్ అధికారంలోకి వచ్చాక పథకాల పేరిట ప్రజలని రకరకాలుగా మోసం చేశారని ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా పథకాలతో ప్రజలని మోసం చేసిన జగన్..తాజాగా జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు భారీ షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. అయితే జాబ్ క్యాలెండర్ కంటే ముందు ఈ రెండేళ్లలో జగన్ ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.అయితే ఇందులో అసలు మీవి ఉద్యోగాలే కాదు..మీరు సేవకులని అని చెప్పిన 2.5 లక్షల వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే పర్మినెంట్ కాని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులని కూడా ఆరు లక్షల్లో కలిపేశారు.
ఇక్కడ మరీ విచిత్రమైన విషయం ఏంటంటే…ఆర్టీసీలో 54 వేల ఉద్యోగులు ముందు నుంచి ఉన్నారు. వారిని ప్రభుత్వంలో విలీనం చేసి, వారికి మేమే ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతుంది. ఇలా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది.ఇక జాబ్ క్యాలెండర్ విషయానికొస్తే…అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జనవరిలో ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ పేరిట విడుదల చేస్తామని చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండేళ్ళు దాటింది. రెండేల్లో క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. తాజాగా మాత్రం 10 వేల ఉద్యోగాలతో రిలీజ్ చేశారు. అంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఇచ్చే ఉద్యోగాలు అవే. పైగా ప్రతి ఏటా 6,500 పోలీసుల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పలు చెప్పారు. కాని క్యాలెండర్‌లో పెట్టింది 450 ఉద్యోగాలు. అలాగే గ్రూప్స్‌కు సంబంధించి 36 ఉద్యోగాలు. ఇక డిఎస్‌సి సంగతి దేవుడుకే తెలియాలి.
ఇలా ఉద్యోగాల క్యాలెండర్ పేరిట మోసం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులని నిరసనలు చేస్తున్నారు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం జగన్‌ని తిడుతున్నారు. ‘నీకో దండం…నీ ఉద్యోగాల క్యాలెండర్‌కో’ దండమని సొంత పార్టీ కార్యకర్తలు జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉద్యోగాల క్యాలెండర్ విషయంలో అన్నీ వర్గాల వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ReplyForward |
Discussion about this post