తెలుగుదేశం పార్టీలో రెడ్డి వర్గం నేతలు చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పొచ్చు. ఉండటానికి తక్కువమంది ఉన్నా సరే…వారు బాబు పట్ల విధేయతతో ఉంటారు. అలా చంద్రబాబు పట్ల విధేయతతో ఉండేవారిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఒకరు. మూడు దశాబ్దాల నుంచి ఈయన టీడీపీలో రాజకీయం చేస్తున్నారు. టీడీపీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…అలాగే ఎమ్మెల్సీగా, మంత్రిగా, చీఫ్‌విప్‌గా కూడా పనిచేశారు.

ఇలా అనేక కీలక పదవులు చేపట్టిన పల్లె…గత ఎన్నికల్లో జగన్ గాలిలో దారుణంగా ఓడిపోయారు. దాదాపు 31 వేల ఓట్ల మెజారిటీ తేడాతో వైసీపీ నేత శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా సరే…మళ్ళీ వెంటనే యాక్టివ్ అయ్యి పనిచేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో పుట్టపర్తిలో టీడీపీని చాలా వరకు పైకి లేపారు. మామూలుగానే పుట్టపర్తిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దీంతో త్వరగానే పికప్ అయ్యారు.

ఇదే సమయంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ సైతం ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో పల్లెకు ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడే పల్లెకు మరో ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడుప్పుడే పార్టీ బలపడుతుందనుకుంటే…ఇలాంటి సమయంలోనే గ్రూపు తగాదాలు పల్లెని దెబ్బ తీసేలా ఉన్నాయి. మామూలుగా చిన్నాచితక గ్రూపులు పుట్టపర్తిలో ఉండేవి. కానీ ఈ మధ్య ఆ గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి.

పల్లెకు వ్యతిరేకంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ బీసీ గంగన్న ఒక గ్రూపుని నడుపుతున్నారు. ఈయనకు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సపోర్ట్ ఉంది. వీరు పుట్టపర్తిలో సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత క్యాడర్‌ని తమవైపుకు తిప్పుకున్నారు. ఇలా వ్యతిరేక వర్గం ఏర్పడటంతో పల్లె అలెర్ట్ అయ్యారు..వెంటనే వ్యతిరేక వర్గాన్ని బుజ్జగించే పనిలో పడ్డారు.

పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అంతకు లోంగే పరిస్తితి లేకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తానని అంటున్నారట. అయినా సరే ఆ వర్గం..సెపరేట్‌గానే ముందుకెళుతుందట. మరి ఈ వర్గం వల్ల పల్లెకు డ్యామేజ్ అయ్యే పరిస్తితి ఉంది.

Discussion about this post