రాష్ట్రంలో టీడీపీ సానుకూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీపై జనం పెట్టుకున్న ఆశలు నెరవేరకపోవడం తో ప్రజల మైండ్ కూడా మారిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు ప్రజలు ఆశగా చూస్తున్నారు. ముఖ్యం గా రాజధాని ప్రాంతమైన.. గుంటూరు జిల్లాలో టీడీపీ పవనాలు బాగా వీస్తున్నాయి. వీటిలో కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో అయితే.. టీడీపీ హవా మరింతగా పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలోని చిలకలూరిపేట, పెదకూరపాడు, వినుకొండల్లో టీడీపీ ఇప్పటికే ఫికప్ అయిపోయింది.
అదేవిధంగా అంత్యంత కీలకమైన గురజాలలో కూడా టీడీపీ పరుగులు పెడుతోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే, పల్నాటి పులి యరపతినేని శ్రీనివాసరావు వ్యూహాలు బాగా పని చేస్తున్నాయి. 2009, 2014 వరుస ఎన్నికల్లో విజయం దక్కించుకున్న యరపతినేని.. మంత్రిగా తనకు అవకాశం దక్కక పోయినా.. పార్టీ వ్యూహాలను.. భారీగా అమలు చేసి.. చంద్రబాబు హయాంలో నిధులు సమీకరించి.. గురజాలను అన్ని రూపాల్లోనూ డెవలప్ చేశారు.
ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కారు అమలు చేసిన పసుపు-కుంకుమ పథకం.. యరప తినేని అమలు చేసిన.. శ్రీమంతం కార్యక్రమం నుంచి తీసుకున్నదే కావడం గమనార్హం. పేదలు, ము ఖ్యంగా అణగారిన వర్గాల్లోని మహిళలకు శ్రీమంతం నిర్వహించి.. వారికి పసుపు కుంకుమ కింద.. చీర, నగ దు.. కానుకలు అందించిన ఏకైక ఎమ్మెల్యేగా యరపతినేని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రభావం ఇప్పటి కీ ఉంది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యరపతినేని మంత్రిగా లేకపోయినా అధిష్టానం వద్ద పలుకుబడితో కోట్లాది రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని బాగా డవలప్ చేశారు.
అంతేకాదు.. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటే.. వైసీపీకి ఓట్లు వేశామని.. కానీ.. ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదని.. గురజాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, యరపతినేని గత రెండేళ్లుగా ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారితో మమేకం అవుతున్నారు. తన సొంత నిధులను కూడా వెచ్చించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.
ఇక, పార్టీ తరఫున పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ఆయన ముందుంటున్నారు. దీంతో ఒక్కసారిగా గురజాలలో టీడీపీ పుంజుకుంది. గతంలో కంటే భిన్నంగా పార్టీకి ఇప్పుడు ఇమేజ్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుతో పాటు గురజాలలో తన గెలుపు విషయంలో ఢోకా లేదన్న ధీమాతో ఉన్న యరపతినేని మంత్రి పదవే టార్గెట్‌గా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
Discussion about this post