ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమంటే..రాజకీయాలకే కాదు..కొన్ని వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్‌గా ఉండేది..ఇక్కడ రాజకీయ నేతల రేపే వివాదాలు ఎక్కువే. అయితే రాజకీయంగా ఇక్కడ వైసీపీ-టీడీపీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. అయితే 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటితే..2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పల్నాడులో ఉన్న 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది.

చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లె స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు కొన్ని స్థానాల్లో రాజకీయం మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కావచ్చు..టీడీపీ నేతలు బలపడటం కావచ్చు..దీని వల్ల పల్నాడులో టీడీపీకి లీడ్ పెరుగుతుంది. చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు కాస్త పట్టు పెరిగింది. ఇటు వినుకొండలో జీవీ ఆంజనేయులుకు ఆధిక్యం కనిపిస్తోంది. గురజాలలో సైతం వైసీపీకి ధీటుగా టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు బలపడ్డారు.

పెదకూరపాడులో కూడా టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తోంది..కాకపోతే ఇక్కడ టీడీపీ ఇంకా బలపడాల్సి ఉంది. అయితే మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాగానే కష్టపడుతున్నారు గాని..ఇప్పటికీ అక్కడ వైసీపీదే లీడ్ కనిపిస్తోంది. ఇక నరసారావుపేటలో పూర్తిగా వైసీపీదే లీడ్ అని చెప్పవచ్చు.


సత్తెనపల్లెలో కాస్త వింత పరిస్తితి ఉంది..ఇక్కడ వైసీపీకి పాజిటివ్ లేదు..అలా అని టీడీపీకి పాజిటివ్ లేదు. జనసేనకు బలం లేదు. కాకపోతే టీడీపీ-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీకి రిస్క్. పైగా పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కుతుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే పల్నాడులో టీడీపీకి కాస్త పట్టు దొరికినట్లు కనిపిస్తోంది.
