ఏపీలో జరిగే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. అసలు వన్‌సైడ్‌గా వైసీపీ విజయాలని సాధిస్తుంది. పంచాయితీ ఎన్నికలు కావొచ్చు…మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు కావొచ్చు…వైసీపీదే హవా. ఇక ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు చరిత్రలో లేని విధంగా వైసీపీ విజయాలు అందుకుంది. మరి విజయాలకు కారణం ఏంటని..ఒక్కసారి విశ్లేషించుకుంటే….ఈ ఫలితాలు జగన్ అద్భుత పాలనకు…ఎమ్మెల్యే, మంత్రుల అద్భుతమైన పనితీరుకి నిదర్శనమా? అంటే అసలు కాదనే చెప్పాలి.

ఎందుకంటే జగన్ పాలన ఎలా ఉందో జనాలకు బాగా తెలుసు. సింపుల్‌గా చెప్పాలంటే ఓ వైపు నుంచి అప్పులు చేసి పథకాల పేరిట డబ్బులు ఇస్తూ..మరో వైపు నుంచి పన్నుల పేరిట ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు…రూపాయి ఇచ్చి, పది రూపాయిలు వసూలు చేస్తున్నారు. జగన్ పాలన వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధికంగా ఎంత నష్టపోయారో అందరికీ తెలుసు. అలాగే జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం.

ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది సక్రమంగా పనిచేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారో తెలిసిందే. కొందరి అక్రమాలకు అంతే లేదని సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే పలు సర్వేలు వచ్చాయి…ఆ సర్వేల్లో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసింది. అలాగే 10 మంది మంత్రులు, 10 మంది ఎంపీలపై వ్యతిరేకత ఉందని తేలింది. మరి వైసీపీ పరిస్థితి ఇలా ఉన్నా సరే వరుసగా ఎన్నికల్లో ఎలా గెలిచిందంటే…దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు.వైసీపీ ఎన్ని మార్గాల్లో ఎన్నికల్లో గెలిచిందో చెప్పాల్సిన పని లేదు. వైసీపీ ఎలా గెలవడానికి చూసిందో ప్రజలందరూ చూశారు…ఎన్ని చేసినా భయంతో ప్రజలు మళ్ళీ వైసీపీకే మద్ధతు తెలిపారు. కాబట్టి వైసీపీ గెలుపు ఎలా వచ్చిందో అర్ధమవుతుంది.

Discussion about this post