వైసీపీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారు..కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే దిశగా జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరికి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇటు టీడీపీ చేతుల్లో ఉన్న పర్చూరులో ఇంచార్జ్ ఉన్న రావి రామనాథం బాబుని సైడ్ చేసి..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఆమంచి..సొంత స్థానం చీరాల. మొన్నటివరకు ఆ సీటు కోసం ఎమ్మెల్యే కరణం బలరామ్ తో విభేదాలు నడిచాయి. కానీ ఇప్పుడు ఆమంచిని పర్చూరుకు పంపడంతో చీరాలలో కరణంకు లైన్ క్లియర్ అయింది. అయితే పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదు..అక్కడ ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. దీనికి తోడు వైసీపీలో కమ్మ వర్గం నేత రావిని తప్పించడం వల్ల…సపోర్ట్ చేసే కొంత కమ్మ వర్గం టీడీపీ వైపుకు వెళ్లవచ్చు.

ఇక ఆమంచి కాపు వర్గం నేత. పర్చూరులో కాపు ఓట్లు ఎక్కువే. అలా అని ఆమంచిని పెట్టినంత మాత్రం కాపు ఓట్లు కలిసొస్తాయని అనుకోవడం పొరపాటే. ఎమ్మెల్యే ఏలూరికి కాపు వర్గంలో కూడా పట్టు ఉంది. అదే సమయంలో నెక్స్ట్ టీడీపీతో జనసేన పొత్తు ఉంటే..పర్చూరులో కాపు ఓట్లు వైసీపీకి ఎక్కువ పడటం కష్టమే.ఎటు చూసుకున్న ఆమంచిని పర్చూరులో పెట్టడం వల్ల..పరోక్షంగా ఏలూరికే లాభం వచ్చేలా ఉంది.


Leave feedback about this