గతంలో మాదిరిగా ఎన్నికల ముందు హడావిడిగా సీట్లు ఇచ్చి…అక్కడ వచ్చే ఇబ్బందులు వల్ల పార్టీకి నష్టం జరగడం, ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చి చివరికి ఓడిపోవడం జరగకుండా ఈ సారి ముందు గానే టిడిపి అధినేత చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చాలా వరకు సీట్లు ఆయన ఫిక్స్ చేశారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే కొందరు నేతలకు సీట్లు ఖరారు చేశారు. అయితే పాదయాత్రతో ముందుకెళుతున్న లోకేష్ సైతం కొన్ని సీట్లు ఖరారు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు అభ్యర్ధులని ప్రకటించేశారు. తాజాగా ఉమ్మడి అనంతపురంలో ఆయన అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతానికి కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాళ్లో లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే.
అయితే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ స్థానాల్లో సీటు కోసం పోటీ ఉంది..దీంతో ఆయా సీట్ల జోలికి లోకేష్ వెళ్లలేదు..కానీ తాజాగా రాప్తాడు, ధర్మవరం సీట్లలో మాత్రం అభ్యర్ధులని ప్రకటించేశారు. రెండు సీట్లు పరిటాల ఫ్యామిలీకి ఫిక్స్ చేశారు. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తారని ప్రకటించారు
అయితే లోకేష్ పాదయాత్రకు రెండు స్థానాల్లో మంచి స్పందన వచ్చింది. దీని వల్ల టిడిపికి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇక టిడిపి ధర్మవరంలో ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ఇటీవల సర్వేల్లో అక్కడ టిడిపి వెనుకబడింది. కానీ రాప్తాడులో టిడిపి బలపడింది. పైగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై వ్యతిరేకత రావడం టిడిపికి ప్లస్ అవుతుంది. కాకపోతే ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కాస్త పాజిటివ్ ఉంది. ఇక్కడ శ్రీరామ్ ఇంకా కష్టపడితే గెలుపు ఛాన్స్ ఉంది. మొత్తానికి పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఫిక్స్.
